సౌత్ లో క్రేజీ కపుల్స్ గా ఉన్న సమంత, నాగ చైతన్య విడిపోతారని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. కానీ ఈ జంట విడాకులతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. ఈ విడాకుల వ్యవహారం సమంతకు మరింతగా సమస్యలు తెచ్చిపెట్టింది. సమంతపై అనేక పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనికి తోడు మీడియాలో Samantha, Naga Chaitanya విడాకులకు కారణాలు ఇవే అంటూ అనేక రూమర్లు ప్రచారం జరిగాయి.
సమంతకు తన స్టైలిస్ట్ Preetham సంబంధం ఉన్నట్లు కూడా ప్రచారం చేశారు. ఇలాంటి పుకార్లు సమంతకి తీవ్ర వేదనగా మారాయి. తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు బ్రేక్ పడాలంటే తాను మౌనం వీడాలని సమంత డిసైడ్ అయింది. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ ఓ పోస్ట్ పెట్టింది.
యూట్యూబ్ ఛానల్స్ అయితే సమంత వ్యక్తిగత జీవితంపై డిబేట్లు నడిపాయి. సమంతని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేశాయి. యూట్యూబ్ ఛానల్స్ తన పర్సనల్ లైఫ్ పై శృతి మించేలా కథనాలు వేస్తుండడంతో సమంత వారికి బుద్ధి చెప్పాలని డిసైడ్ అయింది. కూకట్ పల్లి కోర్టులో సమంత ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ అయిన సుమన్ టివి, తెలుగు పాపులర్ టివి, టాప్ తెలుగు టివి యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేసింది.
ఈ పరువు నష్టం దావా కేసులో సమంత స్టేట్మెంట్ ని ఒకసారి పరిశీలిద్దాం. తెలుగులో అత్యంత పాపులర్ నటిని నేను. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ తో జాతీయ వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందాను. నా నటనకి గాను 4 ఫిలిం ఫేర్ అవార్డులు. 2 నంది అవార్డులు, 6 సౌతిండియా అవార్డులు, 3 సినీ మా అవార్డులు అందుకున్నా.మల్టీనేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వంలో చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కూడా పనిచేశా.
ఇంతటి గుర్తింపు పొందిన నాపై కొందరు కించపరిచేలా వ్యవహరిస్తున్నారు. నా పరువు బజారున పడేలా చేస్తున్నారు. 2017లో నాగ చైతన్యని వివాహం చేసుకున్నా. ఈ ఏడాది అక్టోబర్ 2న ఇద్దరం విడిపోతున్నట్లు కలసి ప్రకటన చేశాం. అప్పటి నుంచి నాపై దుష్ప్రచారం మొదలైంది. నేను అబార్షన్ చేయించుకునాన్ని, 300 కోట్ల డీల్ కుదుర్చుకున్నాను అంటూ యూట్యూబ్ ఛానల్స్, సీఎల్ వెంకట్రావు నాపై అసభ్యంగా కామెంట్స్ చేశారు. ఫ్యాషన్ డిజైనర్ తో సంబంధం ఉన్నట్లు నా దాంపత్య జీవితంపై అనుమానాలు రేకెత్తించారు.
Also Read: సమంత దర్శకురాలి షాకింగ్ డెసిషన్.. విజయ్ దేవరకొండని కాదని చైతూతో..
నా డ్రెస్సింగ్ విధానంపై అసభ్యంగా వీడియోలు చేశారు. నా అనుమతి, వివరణ లేకుండా తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. నా ప్రతిష్టని దిగజార్చేందుకే పక్కా ప్రణాళికతో ఈ వీడియోలు చేశారు. యూట్యూబ్ ఛానల్స్ లో నాపై చేసిన వీడియో లింకులు తొలగించండి. బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పించండి. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోండి అంటూ సమంత కోర్టుని కోరింది.
Also Read: థైస్ అందాలతో అనసూయ హాట్ షో.. ఇంటర్నెట్ లో మంటలు రేపేలా ఫోజులు