Naga Chaitanya
రెండు మూడు చిత్రాలతో విజయ్ దేవరకొండ టాలీవుడ్ లో పాపులర్ హీరోగా మారాడు. విజయ్ దేవరకొండ సినిమాలకు యువతలో ఎక్కువగా క్రేజ్ ఉంది. బోల్డ్ చిత్రాలలో అంతే బోల్డ్ గా, తనకు మాత్రమే సాధ్యమైన యాటిట్యూడ్ తో విజయ్ ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. అందుకే ప్రస్తుతం దర్శకులు విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు ఇష్టపడుతున్నారు.
నిర్మాణ సంస్థలు కూడా క్రేజీ ఆఫర్స్ తో Vijay Devarakonda ముందు వాలిపోతున్నాయి. తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ చేజారిందనే వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థగా ఉన్న వైజయంతి మూవీస్.. విజయ్ దేవరకొండతో ఓ చిత్రం ప్లాన్ చేసింది. దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న Nandini Reddy ఈ చిత్రానికి డైరెక్టర్.
విజయ్ దేవరకొండని కలసి ప్రాజెక్టు గురించి వివరించాలని ఎంతగానో ప్రయత్నించారట. కానీ షూటింగ్ బిజీనో ఏమో కానీ విజయ్ అందుబాటులోకి రాలేదు. దీనితో ఆలస్యం అవుతుండటంతో నందిని రెడ్డి షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండకి బదులుగా Naga Chaitanyaని తీసుకోవాలని డిసైడ్ అయ్యారట.
నాగ చైతన్య ఈ చిత్రానికి సైన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. రీసెంట్ గా నాగ చైతన్య లవ్ స్టోరీ చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ మూవీలో నటిస్తున్నాడు. అలాగే నాగార్జున Bangarraju చిత్రంలో కూడా నటించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక వచ్చే ఏడాది నందిని రెడ్డి దర్శకత్వంలోని చిత్రం ప్రారంభం కానుంది.
నందిని రెడ్డి ప్రస్తుతం సంతోష్ శోభన్ తో ఓ చిత్రం చేస్తున్నారు. సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన ఓ బేబీ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రంలో చివర్లో చైతు కామియో రోల్ పోషించిన సంగతి తెలిసిందే.
Samanthaకు బ్లాక్ బస్టర్ అందించిన దర్శకురాలి సినిమాలో నాగ చైతన్య నటించనుండడం ఆసక్తిగా మారింది. అది కూడా విజయ్ దేవరకొండతో అనుకున్న కథతో. చైతు, సమంత ఇటీవల విడిపోయిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ మొత్తానికి, అభిమానులకు షాకిస్తూ చైతు, సమంత వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.