Samantha Shocking Comments: షాకింగ్ సీక్రెట్స్ బయట పెట్టిన సమంత..హెల్త్ కండీషన్ గురించి ఏం చెప్పిందంటే..?

First Published | Jan 9, 2022, 1:04 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) షాకింగ్ నిజాలు బయట పెట్టింది. తన ఆరోగ్యం గురించి ఓ సీక్రెట్ ను రివిల్ చేసింది సామ్. మానసికంగా బాగా కృంగిపోయాను అంటోంది స్టార్ హీరోయిన్.

ఈమధ్య సమంత(Samantha) ఏంచేసిన అది వైరల్ అవుతొంది. సోషల్ మీడియాలో తాను ఏది పోస్ట్ చేసినా... అది వైరల్ న్యూస్ అవుతోంది. అందులోను సమంత కూడా ఈ మధ్య నెటిజన్లు షాక్ అయ్యేలా పోస్ట్ లు  పెడుతుంది. ముఖ్యంగా నాగచైతన్యతో డివోర్స్ తరువాత.. సమంత ప్రతీ కదలికపై సోషల్ మీడియా కన్ను ఉంటుంది. సమంత కూడా డివోర్స్ తరువాత చాలా విషయాలు పంచుకుంటుంది.

రీసెంట్ గా మరోసారి సమంత(Samantha) కామెంట్స్ వైరల్ అయ్యాయి. తన జీవితంలో జరిగిన చాలా విషయాలను బయట పెడుతూ వస్తోంది సమంత.. రీసెంట్ గా మరో షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. తాను చాలా మానసిక సమస్యలతో బాధపడ్డానంటోంది సమంత. చాలా సమస్యలు తనను వేధించాయి అంటోంది. రోషిని  ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సైకియాట్రిక్ ఎట్ యువర్ డోర్ స్టెప్  కార్యక్రమంలో సమంత పాల్గోంది.


ఈ సందర్భంగా సామ్ ఈ విషయాలు పంచుకుంది. తాను తన జీవితంలో చాలా మానసిక సమస్యలు ఫేస్ చేసిందని.. ఆ టైమ లో తన స్నేహితులు.. తన డాక్టర్స్ సహాయంతో తాను ఈ సమస్యలను ఎదిరించి బయట పడ్డానంటోంది. ఈరోజు తాను ధైర్యంగా నిలబడటానికి.. జీవితంలో ముందుకు వెళ్ళడానికి స్నేహితులు,కుటుంబసభ్యులు.. డాక్టర్ల సహయమే కారణం అంటుంది సమంత(Samantha). శరీరానికి దెబ్బలు తిగిలినా.. మనసుకి దెబ్బలు తగిలినా.. వాటిని తగ్గించడానికి డాక్టర్లనే కలవాలంటు సలహా ఇస్తోంది సామ్.

డివోర్స్ తరువాత సినిమాల విషయంలో దూసుకుపోతోంద సమంత(Samantha). వరుస ఆఫర్లతో బిజీ అవుతోంది. ఆలోచనలను మార్చుకుని.. సినిమాల వైపు మళ్శిస్తోంది. బిజీగా గడుపుతోంది సమంత. ఫ్రెండ్స్ తో టూర్స్ ప్లాన్ చేసుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. రీసెంట్ గా ఆమె చేసిన పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం యశోద మూవీ షూటింగ్ లో ఉన్నారు సమంత(Samantha). గుణశేఖర్ డైరెక్షన్ లో శాంకుంతలం మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసేసింద. ఇక బాలీవుడ్ ఆఫర్స్ కూడా కొట్టేస్తుంది బ్యూటీ. త్వరలో బాలీవుడ్ సినిమాలపై క్లారిటీ ఇవ్వబోతోంది. ఇటు టాలీవుడ్ లో కూడా మరికొన్ని ఆఫర్స్ చేతిలో పెట్టుకుంది. వరుసగా వాటిని కంప్లీట్ చేయబోతుంది.

Latest Videos

click me!