టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh) సోషల్ మీడియా జనాలపై మండిపడుతుంది. తన గురించి ఉన్నది లేనిది ప్రచారం చేయవద్దు.. తన గురించి ఏదైన విషయం ఉంటే.. డైరెక్ట్ గా తానే చెపుతానంటొంది. పిచ్చి పిచ్చిగా రూమర్స్ స్ప్రెడ్ చేయవద్దు అంటూ వార్నింగ్ ఇష్తోంది.
రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ(Jockey Bhagnani )తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమధ్య ఈ విషయాన్ని తానే స్వయంగా అనౌన్స్ చేసింది.ఇద్దరి ఫోటో కూడా అప్ లోడ్ చేసింది. అయితే తాజాగా వీరిద్దరు రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ రూమర్స్ బయటకు వచ్చాయి. ఎవరికి తెలియకుండా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు అని సోషల్ మీడియా కోడై కూస్తుంది.
ఈ వార్తలపై గట్టిగానే స్పందించింది రకుల్ తన జీవితానికి సంబంధించిన విషచం ఏదైనా ఉంటే తానే స్వయంగా చెపుతాను అంది. నా చేతిలో ఇప్పుడు దాదాపు పది సినిమాలు ఉన్నాయి. ముందు అవి కంప్లీట్ చేయాలి. ప్రస్తుతం నా దృష్టి అంతా వాటిపైనే ఉంది అని అంటుంది. అయినా రహస్యం గా పెళ్లి చేసుకోవల్సిన అవసరం తనకు ఏంటీ అని ప్రశ్నిస్తుంది రకుల్.
అంతే కాదు తన పని తాను చేసుకుపోతానంటుంది. వదంతులు సృష్టించినా.. పట్టించుకునే తీరిక తనకు లేదు అంటుంది రకుల్. ఎవరైనా ఇలా తనను డిస్ట్రబ్ చేయాలి అని చూసినా వాటిని పట్టించుకోను అంటోంది రకుల్. తన జీవితం ఎంతో పారదర్శకంగా ఉంటుందని. ఏమున్నా దాచుకోవల్సిన అవసరం తనకు లేదు అంటోంది.
ఇక తన ప్రియుడు జాకీ భగ్నాని(Jockey Bhagnani ) గురించి చెపుతూ.. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి.. మకు దగ్గరగా ఉన్నవారికి మేం ఇచ్చే విలువ కూడా ఒకేలా ఉంటుంది. ప్రతీ విషయంలో మేం కరెక్ట్ గా ఉంటాం.. అది ఫుడ్ అయినా.. వర్క్ అవుట్స్ అయినా.. ఏదైనా ఖచ్చితంగా పాటిస్తాం అంటోంది. ఇలా అన్నింటిలో అభిరుచులు కలవబట్టే తాము కనెక్ట్ అయ్యామంటుంది రకుల్ ప్రీత్.