`నాగచైతన్యతో విడాకులు`.. సమంత మైండ్‌ బ్లోయింగ్‌ పోస్ట్.. ఏకంగా డాగ్స్ తో

Published : Sep 01, 2021, 07:38 PM IST

`సమంత విడాకులు`..ఇప్పుడు టాలీవుడ్‌ సంచలనంగా మారింది. ఎటు చూసినా సమంతకి సంబంధించిన కథనాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సామ్‌ స్పందించింది. దీనిపై ఆమె సోషల్‌ మీడియా ద్వారా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది.   

PREV
18
`నాగచైతన్యతో విడాకులు`.. సమంత మైండ్‌ బ్లోయింగ్‌ పోస్ట్.. ఏకంగా డాగ్స్ తో

సమంత టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలోనూ తనది టాప్‌ ప్లేస్‌. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. అయితే తన ఫ్యామిలీ లైఫ్‌ విషయంలో ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది సామ్‌. 
 

28

నాగచైతన్యని ఆమె ప్రేమించి 2017లో పెళ్లి చేసుకుంది. దాదాపు నాలుగేళ్లు కంప్లీట్‌ కావస్తున్నాయి. అప్పటి నుంచి సినిమాలతోనే బిజీగా ఉంది సమంత. ఇంకా చెప్పాలంటే పెళ్లి తర్వాతనే ఆమె మరింత బిజీ అయిపోయింది. 

38

వరుసగా హిట్లతోనూ విజయవంతంగా రన్‌ అవుతుంది. ఇటీవల `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2` వెబ్‌ సిరీస్‌లోనూ నటించి దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకుంది. అటు బలమైన పాత్రలున్న వెబ్‌ సిరీస్‌కి, ఇటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది సమంత. 

48

ఈ నేపథ్యంలో సమంతకి, నాగ్‌ ఫ్యామిలీకి పడటం లేదనే వార్తలు సోషల్‌ మీడియాలో గుప్పుమంటున్నాయి. చైతూతోనే విభేధాలున్నాయని అంటున్నారు. ఇటీవల నాగార్జున బర్త్ డే పార్టీలోనూ సమంత మిస్సింగ్‌కి కూడా అదే కారణమంటున్నారు. 

58

అయితే సమంత, చైతూలు, నాగ్‌ ఫ్యామిలీ వ్యవహారం విడాకుల వరకు వెళ్లిందని, అందుకే దూరంగా ఉంటున్నారనే వార్తలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్‌ హాట్‌గా చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు దీనిపై అటు సమంతగానీ, ఇటు నాగ్‌ ఫ్యామిలీగానీ, చైతన్య గానీ స్పందించలేదు. 
 

68

దీంతో నిజంగానే వీరి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలకు ఊతమిచ్చినట్టవుతుంది. మరోవైపు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంత చెబుతూ, రిస్టిక్షన్‌లో ఉండటం ఇష్టం లేదనే విషయాన్ని వెల్లడించింది. దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ, ఆమె అక్కినేని ఫ్యామిలీ పైనే కామెంట్‌ చేసిందంటున్నారు. 
 

78

తాజాగా పరోక్షంగా స్పందించి సమంత. ఇన్‌స్టోరీస్‌లో డాగ్స్ మీమ్స్ ని పంచుకుంది. ఇందులో గట్టిగా మొరుగుతున్నట్టుగా ఓ డాగ్‌ ఉండగా, కింద సైలెంట్‌గా నవ్వుతూ ఉన్న డాగ్స్ జోడించి ఉన్నాయి. దానికి సమంత చెబుతూ, మొరిగేది `మీడియా` అని, కింద సైలెంట్‌గా నవ్వుతూ ఉన్న డాగ్స్ కి రియాలిటీ అని పెట్టింది. 

88

దీంతో తమ మధ్య ఏం లేదని, తాము బాగానే ఉన్నామని, కానీ మీడియానే ఓవర్‌గా గగ్గోలు పెడుతుందనే అర్థంతో ఈ మీమ్స్ ని పంచుకుంది సమంత. దీనిపై సర్వత్రా కామెంట్లు వస్తున్నాయి. మరి ప్రత్యక్షంగా సమంతగానీ, నాగ్‌, నాగచైతన్యగానీ స్పందిస్తేనే ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. లేదంటే అప్పటి వరకు మీడియాలో కథనాలు ఇలానే వస్తాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories