తాజాగా ఈ షో ప్రోమో విడుదలైంది. ఇందులో సమంత, విజయ్ దేవరకొండ, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్, అలియాభట్, అనిల్ కపూర్, జాన్వీ కపూర్, అనన్య పాండే, టైగర్ ష్రాఫ్, షాహిద్ కపూర్ పాల్గొన్నారు. సమంత.. అక్షయ్ కుమార్‌తో కలిసి సీట్‌ని పంచుకున్నారు. ఇందులో కరణ్‌కి, సమంతకి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఆద్యంతం ఆసక్తికరంగా, సంచలనంగా మారడం విశేషం.