సౌత్ లో తిరుగులేని హీరోయిన్ గా దూసుకుపోతున్న సమంత ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. త్వరలో సమంత యశోద చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన యశోద ట్రైలర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.
ఈ సందర్భంగా సమంత సోషల్ మీడియాలో అందరికి కృతజ్ఞతలు చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ఆరోగ్య సమస్యపై సామ్ ఎట్టకేలకు ఓపెన్ అయింది. ఇటీవల సమంత అమెరికాకి చికిత్స కోసం వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. తాను ఎలాంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నానో వివరిస్తూ సమంత ఎమోషనల్ కామెంట్స్ చేసింది.
యశోద ట్రైలర్ కి మీరు ఇస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. ఈ సందర్భంగా మీ అందరికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా. జీవితం నాకు అంతులేని సవాళ్లు విసురుతూనే ఉంది. మీతో పంచుకుంటే వాటిని ఎదుర్కొనే శక్తి వస్తుందని నా నమ్మకం. నేను మైసిటిస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్ ఆరోగ్య సమస్యని ఎదుర్కొంటున్నా. కొన్ని నెలల క్రితమే చికిత్స కూడా జరిగింది.
పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ విషయం మీతో పంచుకోవాలనుకున్నా. త్వరగానే కోలుకుంటానని భావించా. కానీ ఆసల్యం అవుతోంది. ప్రస్తుతం నేను నెమ్మదిగా కోలుకుంటున్నా. నేను వీలైనంత త్వరగా కోలుకుంటానని వైద్యులు కూడా విశ్వాసం ఉంచుతున్నారు. నా లైఫ్ లో ఫిజికల్ గా మెంటల్ గా మంచి రోజులు చెడు రోజులు ఉన్నాయి.
కొన్ని సమస్యలు అయితే ఇక ఒక్క క్షణం కూడా భరించలేను అనుకున్న టైం ఆ సమయం ఎలాగో గడచిపోయింది. ఇప్పుడు కూడా ఇంకొక్క రోజులో నేను పూర్తిగా కోలుకుంటాను అనే నమ్మకంతోనే ఉన్నా. లవ్యూ ఆల్ అంటూ సమంత ఎమోషల్ కామెంట్స్ చేసింది.
సమంత తన ఆరోగ్య పరిస్థితి వివరించడంతో సెలెబ్రిటీలు, అభిమానులు త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు. శ్రియశ్రీయ శరన్, రాశి ఖన్నా, సుష్మిత కొణిదెల లాంటి సెలెబ్రిటీలు సమంత స్పీడ్ గా రికవరీ కావాలని కామెంట్స్ పెడుతున్నారు.