రెండో పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది?.. లెక్కలు బయటపెట్టిన సమంత.. ఇక మ్యారేజ్‌ లైఫ్‌కి గుడ్‌ బై

Published : Dec 19, 2023, 11:16 PM IST

సమంత.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ పెళ్లి ఎప్పుడు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. దీనికి సమంత స్పందించింది. ప్రాక్టీకల్‌ లెక్కలు చూపించి సమాధానం చెప్పింది.   

PREV
16
రెండో పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది?.. లెక్కలు బయటపెట్టిన సమంత.. ఇక మ్యారేజ్‌ లైఫ్‌కి గుడ్‌ బై

సమంత, నాగచైతన్య ఏడేళ్లు ప్రేమించుకున్నారు. `ఏం మాయ చేసావె` సమయంలో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. సుధీర్ఘ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లారు. పెద్దల అంగీకారంతో తమ పెళ్లి చేసుకున్నారు. కరెక్ట్ గా నాలుగేళ్ల తర్వాత బ్రేకప్‌ చెప్పుకున్నారు. రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సమంత అనారోగ్యం పాలయ్యింది. దాన్నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అందుకే ఏడాది పాటు బ్రేక్‌ ప్రకటించింది. 
 

26

ప్రస్తుతం సమంత బ్రేక్‌లో ఉంది. చాలా రోజులుగా ఆమె రిలాక్స్ అవుతుంది. తనకు నచ్చిన లైఫ్‌ని అనుభవిస్తుంది. వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఆధ్యాత్మిక సేవలో మునిగితేలుతుంది. కొత్త అనుభూతులను పొందుతుంది. మయోసైటిల్‌ వ్యాధి కారణంగా కోల్పోయిన ఎనర్జీని తిరిగి పొందుతుంది. ఈ క్రమంలో ఇటీవల మళ్లీ యాక్టివ్‌గా మారింది సమంత. తరచూ బయట కనిపిస్తుంది. పబ్లిక్‌లోకి వస్తూ అలరిస్తుంది. సమంత ఈజ్‌ బ్యాక్ అనే సందేశాలనిస్తుంది. 
 

36

సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది. ఓ వైపు గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటుంది. మరోవైపు ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంది. అందులో భాగంగా సమంత తాజాగా ఫ్యాన్స్ తో చిట్‌చాట్‌ చేసింది. ఇందులో ఆమె తన రెండో పెళ్లిపై స్పందించింది. ఓ అభిమాని రెండో పెళ్లి గురించి ఆలోచించకండి అంటూ సలహా ఇచ్చాడు. దీనికి సమంత రియాక్షన్‌ మాత్రం క్రేజీగా అనిపించింది. 
 

46

సామ్‌ స్పందిస్తూ, రెండో పెళ్లి గురించి ఆలోచించడం అనేది చెత్త పెట్టుబడి అని వర్ణించింది. గణాంకాల ప్రకారం అదొక బ్యాడ్‌ ఇన్వెస్టిమెంట్‌ అని పేర్కొంది. అంతేకాదు ఏకంగా గణాంకాలను కూడా బయటపెట్టింది సమంత. ఓ స్టాటిస్టికల్‌ సంస్థ చేసిన సర్వే రిపోర్ట్ అంశాలను పేర్కొంది.  దీనికి ప్రకారం మొదటి మ్యారేజ్‌ విషయంలో యాభై శాతం మంది విడాకులు తీసుకుంటున్నారని వెల్లడించింది.

56

ఇక రెండో పెళ్లి విషయంలో అది పెరిగిందని తెలిపింది. ఆ లెక్కలు 67శాతం ఉందని చెప్పింది. రెండో పెళ్లిలో 67శాతం మళ్లీ విడాకులు తీసుకుంటున్నారని, మూడో పెళ్లి చేసుకున్న వారిలో 73శాతం డైవర్స్ అవుతున్నట్టు ఈ గణాంకాలు ఉన్నాయి. దీంతో ఇక తనజీవితంలో పెళ్లి అనే ఆలోచనే లేదనే విషయాన్ని సమంత స్పష్టంచేసింది. ఇక మ్యారేజ్‌ లైఫ్‌కి పూర్తిగా గుడ్‌ బై చెప్పినట్టే అనేది క్లారిటీ ఇచ్చింది సామ్‌. 

66
Samantha Ruth Prabhu

సమంత మళ్లీ సినిమాల్లో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ఆమె ప్రస్తుతం హిందీలో `సిటాడెల్‌` అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. వరుణ్‌ ధావన్‌ హీరోగా చేశాడు. ఈ వెబ్‌సిరీస్‌ విడుదలకు సిద్ధమవుతుంది. వచ్చే ఏడాది మేలో ఇది విడుదలయ్యే అవకాశం ఉందని, మార్చి నుంచి ఈ సిరీస్‌ ప్రమోషన్స్ లో పాల్గొంటామని తెలిపింది సామ్‌. ఇక తెలుగులో చివరగా `ఖుషి` చిత్రంలో నటించింది. ఇది ఫర్వాలేదనిపించుకుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories