ఆ సమయంలో నేను తినే ఆహారమే నా జబ్బును ట్రిగ్గర్ చేసేది. నా జీర్ణవ్యవస్థలో చిన్న తేడా వచ్చినా మయోసైటిస్ సమస్య పెరిగిపోయేది. అందుకే, నేను చాలా కఠినమైన డైట్ పాటించాల్సి వచ్చింది.
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్, కోట్ల హృదయాలను గెలుచుకున్న సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఇప్పుడు వార్తల్లో నిలిచారు. ఈసారి తన సినిమాతో పాటు, తన ఆరోగ్యం గురించి పంచుకున్న బాధాకరమైన విషయాలతో అందరి దృష్టిని ఆకర్షించారు.
27
సమంత బాగా బరువు తగ్గడంతో అభిమానుల ఆందోళన
గత కొంతకాలంగా సమంత బాగా బరువు తగ్గడంతో అభిమానులు ఆందోళన చెందారు. "ఎందుకింత సన్నగా అయిపోయారు?" అనే ప్రశ్నకు సమంత ఇప్పుడు ఎమోషనల్‌గా సమాధానం ఇచ్చారు.
37
నేను తినలేకపోతున్నాను
సమంత తన కొత్త సినిమా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaram) ప్రమోషన్లలో, తాను ఎదుర్కొంటున్న 'మయోసైటిస్' (Myositis) అనే ఆటోఇమ్యూన్ వ్యాధి తీవ్రత గురించి మాట్లాడారు. "నన్ను చూసినప్పుడల్లా, ఎందుకింత బరువు తగ్గారని అడుగుతున్నారు. కానీ ఒకరి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నాకు తినాలని లేదు అని కాదు, నేను తినలేకపోతున్నాను" అని సమంత తన మనసులోని మాట చెప్పారు.
సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఆ రెండేళ్లు సమంతకు నరకంలా గడిచాయి. "ఆ సమయంలో నేను తినే ఆహారమే నా జబ్బును ట్రిగ్గర్ (Trigger) చేసేది. నా జీర్ణవ్యవస్థలో (Gut) చిన్న తేడా వచ్చినా నా మయోసైటిస్ సమస్య పెరిగిపోయేది" అని సమంత వివరించారు.
57
చాలా కఠినమైన డైట్
"అందుకే, నేను చాలా కఠినమైన డైట్ పాటించాల్సి వచ్చింది. దాదాపు రెండేళ్ల పాటు నేను ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. మూడూ పూటలా ఒకే రకమైన రుచి లేని, చప్పటి ఆహారం తినాల్సి వచ్చింది" అని తన కష్టాన్ని చెప్పుకొచ్చారు.
67
పెంపుడు పిల్లికి 'జెలాటో' అని పేరు
సమంత తన పెంపుడు పిల్లికి 'జెలాటో' (Gelato) అని పేరు పెట్టారు. ఈ పేరు వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఆహారంపై కఠినమైన ఆంక్షలు ఉన్న సమయంలో, డాక్టర్లు సమంతకు చక్కెర, పాలు లేని 'జెలాటో' ఐస్‌క్రీమ్ తినడానికి అనుమతి ఇచ్చారట. ఏళ్ల తర్వాత ఆమె తిన్న మొదటి రుచికరమైన ఆహారం అదే. ఆ క్షణం గుర్తుగా తన పిల్లికి జెలాటో అని పేరు పెట్టుకున్నారు.
77
సమంతకు కంబ్యాక్ మూవీ
2022లో 'యశోద' సినిమా ప్రమోషన్లప్పుడు తనకు మయోసైటిస్ ఉందని సమంత బయటపెట్టారు. అప్పటి నుంచి ఆమె ధైర్యంగా ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ఇప్పుడు ఆమె కోలుకుంటున్నారు.తాజాగా సమంత నటించిన మా ఇంటి బంగారం చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది సమంతకు కంబ్యాక్ మూవీ అవుతుంది అని అంతా భావిస్తున్నారు.