Samantha : ‘స్టార్ హోటల్ లో పని చేశా... ఒక్క పూట భోజనమే కష్టం’.. చిన్నతనంలో సమంత కష్టాలు!

Published : Jan 09, 2024, 11:45 AM IST

మధ్య తరగతి కుటుంబం.. ఒక్క పూట భోజనమే కష్టంగా ఉండే రోజులు.. చదువుకోలేని స్థితి.. ఇలా సమంత జీవితంలో చాలానే కష్టాలు ఉన్నాయి. వాటన్నింటినీ తాజాగా చెప్పుకొచ్చారు సామ్. తన లైఫ్ స్టోరీతో కన్నీళ్లు తెప్పించేసింది.  

PREV
16
Samantha : ‘స్టార్ హోటల్ లో పని చేశా... ఒక్క పూట భోజనమే కష్టం’.. చిన్నతనంలో సమంత కష్టాలు!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆయా ఈవెంట్లలో పాల్గొంటూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా సామ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన లైఫ్ లో ఎదుర్కొన్నకష్టాలను వివరించారు. 
 

26

సమంత ఎప్పుడూ ఎనర్జిటిక్ గా.. ఇతరులకు ఇన్ స్పిరేషన్ గానే కనిపిస్తుంటారు. ఆమె చేసే సినిమాలు.. వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. దీంతో సామ్ స్ట్రాంగ్ విమెన్ గానూ చెబుతుంటారు. అలాంటిది సమంత తన జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో రీసెంట్ గా తెలియజేసింది. 

36

సామ్ తన బాల్యజీవితం గురించి మాట్లాడింది. మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన సామ్ చిన్నతనంలోనే చాలా కష్టాలు చవిచూసిందని తెలిపారు. గతంలో ఒక్క పూట భోజనం చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. తన తల్లిదండ్రులు తనను చదువుకోవాలని ప్రోత్సహిస్తూనే వారని తెలిపింది. 

46

కానీ, ఆర్థిక స్థోమతలేక అప్పట్లో ఉన్నత చదువులు చదవలేకపోయినట్టు తెలిపింది. కుటుంబం కోసం ఏ పని దొరికినా చేసేదని చెప్పుకొచ్చింది. చదువుకుంటూనే చిన్నపాటి ఉద్యోగం కూడా చేసిందంట. అందులో ఒకటి.. ఓ స్టార్ హోటల్ లో సామ్ రూ.500 నెల జీతానికి పనిచేశారంట. అదే తన మొదటి సంపాదన అని కూడా చెప్పారు. 

56

తన చిన్నతనంలోని కష్టాలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. దీంతో సామ్ మాటలకు ఫ్యాన్స్ భావోద్వేగమవుతున్నారు. స్టార్ హోటల్ లో పనిచేసే స్థితి నుంచి ప్రస్తుతం ఇండియాలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిన తీరును అభినందిస్తున్నారు. తనను స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. 

66

ఇక సామ్ హీరోయిన్ గా ఎదిగినావ్యక్తిగతంగా సమస్యలు వస్తూనే ఉన్నాయి. చైతో విడాకులు, ఆ వెంటనే అనారోగ్యం పాలవడం సామ్ ను ఇబ్బందులకు గురిచేశాయి. అందుకే ఏడాదిపాటు సినిమాలకూ బ్రేక్ ఇచ్చారు సామ్. ప్రస్తుతం బౌన్స్ బ్యాక్ అయ్యారు. చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. త్వరలోనే తన ప్రాజెక్ట్స్ ను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. చివరిగా సామ్ నటించిన చిత్రం ‘ఖుషి’. నెక్ట్స్ ‘సిటడెల్’ సిరీస్ తో అలరించనుంది. 

click me!

Recommended Stories