టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఎవరెవరు ఏం చదువుకున్నారు? అందరిలో ఎవరు టాప్ అంటే!

First Published Jan 9, 2024, 10:43 AM IST

అందం తెలివి తేటలు డెడ్లీ కాంబినేషన్. హీరోయిన్స్ కి గ్లామర్ తో పాటు ఎడ్యుకేషన్ చాలా అవసరం. కెరీర్ లో రాణించడానికి కావలసిన నాలెడ్జ్, బిహేవియర్, కల్చర్ చదువు సమకూరుస్తుంది. 
 

కాబట్టి హీరోయిన్స్ కావాలంటే ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫకేషన్స్ అవసరం లేకపోయినా.. మోడరన్ సొసైటీలో మనగలగాలి అంటే చదువు చాలా అవసరం. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా వెలిగిపోతున్న సమంత, తమన్నా, కాజల్, అనుష్క, నయనతార, రష్మిక, కీర్తి సురేష్... ఇలా పలువురు ఏం చదువుకున్నారో చూద్దాం... 
 


సమంత చదువులో కూడా ఫస్ట్. చిన్నప్పటి నుండి సమంత చాలా చురుగ్గా ఉండేవారట. కాగా సమంత చెన్నైలో బి. కామ్ పూర్తి చేశారు. 2010లో విడుదలైన ఏమాయ చేశావే మూవీతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. 

Latest Videos


ఇక నేషనల్ క్రష్ రష్మిక మందాన ఆర్ట్స్ స్టూడెంట్. ఆమె సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ చేశారు.కన్నడ చిత్రం 2016లో విడుదలైన కిరాక్ పార్టీ తో హీరోయిన్ గా మారారు. 

ఇక జీరో సైజు బేబీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా బిఎస్పీ చేశారు. 2009లో విడుదలైన జల్లి మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ప్రస్తుతం బాలీవుడ్ లో చిత్రాలు చేస్తున్నారు. 

స్వీటీ అనుష్క శెట్టి కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేశారు. ఆమె బీసీఏ చేయడం జరిగింది. అనుష్క యోగా ట్రైనర్ కూడాను. 2005లో దర్శకుడు పూరి సూపర్ మూవీతో అనుష్కను హీరోయిన్ చేశాడు. 

చందమామ కాజల్ కూడా డిగ్రీ పూర్తి చేశారు. కాజల్ మాస్ మీడియా లో బీఏ చేశారు. చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేసి హీరోయిన్ అయ్యారు. హీరోయిన్ గా కాజల్ ఫస్ట్ మూవీ 2007లో విడుదలైన లక్ష్మీ కళ్యాణం. 
 


స్టార్ కిడ్ కీర్తి సురేష్ ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ చేశారు. హీరోయిన్ మేనక కూతురైన కీర్తి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించారు. కీర్తి తండ్రి సురేష్ దర్శకుడు కావడం విశేషం. 
 


ఇక స్టార్ లేడీ పూజా హెగ్డే కామర్స్ లో పీజీ పూర్తి చేశారు. ఆమె ఎం. కామ్ చేయడం జరిగింది. కాలేజ్ డేస్ లో పూజా కల్చరల్స్ లో బాగా పార్టిసిపేట్ చేసేవారట. 2012లో విడుదలైన ముగమూడి తమిళ చిత్రంతో పూజా హీరోయిన్ అయ్యారు. 

ఇక సాయి పల్లవి డిగ్రీ గురించి అందరికీ తెలుసు. ఎంబీబీస్ చేసినట్లు సాయి పల్లవి అనేక ఇంటర్వూస్ లో చెప్పారు. హీరోయిన్ గా రిటైర్ అయితే వైద్య వృత్తి చేసుకుంటానని సాయి పల్లవి వెల్లడించారు. తెలుగులో సాయి పల్లవి మొదటి చిత్రం ఫిదా. 


మిల్కీ బ్యూటీ తమన్నా ఆర్ట్స్ స్టూడెంట్. ఆమె బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2005లో విడుదలైన హిందీ చిత్రం చాంద్ సా రోషన్ చెహ్రా మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. 
 

మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ సైన్స్ స్టూడెంట్. ఆమె బీఎస్సీ డిగ్రీ చేశారు. 36 ఏళ్ల శృతి హాసన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. హీరోయిన్ గా 2009లో లక్ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. 

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార బీఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశారు. 2003లో మలయాళ పరిశ్రమలో నయనతార కెరీర్ మొదలైంది. ఇటీవల దర్శకుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న నయనతార సరోగసి పద్ధతిలో కవల పిల్లల్ని కన్నారు. 

click me!