స్కూల్ లోనే లవ్.. దొంగచాటుగా తిరిగేవాళ్లం.. ఇంట్రెస్టింగ్ గా డైరెక్టర్ మారుతీ - స్పందన ప్రేమ కథ..

First Published | May 5, 2023, 4:28 PM IST

స్టార్ డైరెక్టర్ మారుతీ (Maruthi) తాజాగా తన లవ్ స్టోరీని రివీల్ చేశారు. తన భార్యతో కలిసి ఓ షోకు హాజరైన ఆయన తన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. 
 

టాలెంటెడ్ దర్శకుడు  మారుతీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు ‘ఈరోజుల్లో’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అదిరిపోయే కామెడీ, బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్ తో ఆడియెన్స్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సాధించారు. అయితే తాజాగా ఆయన రియల్ లవ్ స్టోరీని రిలీవ్ చేయడం ఆసక్తికరంగా మారింది.
 

స్టార్ యాక్టర్, కమెడియన్ వెన్నెల కిషోర్ (Vennela Kishore) హోస్ట్ గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో ‘అలా మొదలైంది’. షోకు ఇప్పటికే నిఖిల్, రాజశేఖర్ - జీవిత, మంచు మనోజ్ తమ లైఫ్ పార్ట్ నర్స్ తో కలిసి హాజరై సందడి చేశారు. తాజాగా డైరెక్టర్ మారుతీ తన భార్య వీనరాగ స్పందన (Veenaraga Spandana) గెస్ట్ లుగా వచ్చారు. 
 


వీరి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా  విడుదల చేశారు. ఈ సందర్భంగా మారుతీ - వీనరాగ స్పందనలు తమ లవ్ స్టోరీ గురించి, పెళ్లి తర్వాత తమ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బ్యూటీఫుల్ లవ్ స్టోరీలను తెరపై ప్రజెంట్ చేసే మారుతీ తన లైఫ్ లోనూ సూపర్ లవ్ స్టోరీ ఉందని చెప్పుకొచ్చారు. 
 

ముందుగా స్పందన మాట్లాడుతూ.. మేమిద్దరం ఒకే స్కూల్ లో చదివాం. ఆయన నా సీనియర్. 8వ తరగతిలో నాకు ఆయన ముఖంగా నచ్చింది. 9వ తరగతిలో టాలెంట్ నచ్చింది. పదో తరగతి వచ్చే సరికి తను వెళ్లిపోయాడు. అయినా లవ్ కొనసాగింది. నన్ను కలిసేందుకు ఆయన ఆర్టీసీ బస్సులో వచ్చే వారు. నేను స్కూటీపై వెళ్లేదాన్ని. 
 

అలా మేం ఇద్దరు దొంగతనంగా మీట్ అయ్యి నా స్కూటీపైనే తిరిగేవాళ్లం.’ అని చెప్పింది. ఇక మారుతీ మాట్లాడుతూ.. ‘ఆమె డైరీ రాస్తుండేది. ఈరోజు చక్కగా వచ్చాడు.. నుంచి అన్నీ రాసేంది. పడేసేందుకు వేసే ఎదవ పనులన్నింటినీ నోట్ చేసేది. ఇప్పటికీ డైరీ అలానే ఉంది. మా టూర్స్ కు సంబంధించిన ప్లానింగ్స్ ఆమె డిసైడ్ చేస్తుంది.’ అని చెప్పారు. 
 

తమ జీవితంలో మరిన్ని విషయాలు మే9న ఫుల్ ఎపిసోడ్ తో తెలియనున్నాయి. చివరిగా ‘పక్కా కమర్షియల్’ను డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో సినిమా చేస్తున్నారు. ఇంత వరకు అఫిషీయల్ అనౌన్స్ మెంట్ ఇవ్వకపోయినా.. షూటింగ్ మాత్రం కొనసాగుతుందని తెలుస్తోంది.

Latest Videos

click me!