సమంతకి ఆ స్టార్‌ హీరోపై క్రష్‌.. ప్రభాస్‌, షారూఖ్‌లపై తన అభిప్రాయం ఇదే.. అస్సలు ఊహించి ఉండరు!

Published : Mar 18, 2024, 08:31 AM IST

సమంత స్టార్‌ హీరోలపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేసింది. ప్రభాస్‌, షారూఖ్‌లపై తన అభిప్రాయం చెప్పింది. అలాగే ఆ స్టార్‌ హీరో అంటే క్రష్‌ అని వెల్లడించింది. 

PREV
16
సమంతకి ఆ స్టార్‌ హీరోపై క్రష్‌.. ప్రభాస్‌, షారూఖ్‌లపై తన అభిప్రాయం ఇదే.. అస్సలు ఊహించి ఉండరు!
Samantha

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇప్పుడు తన అనారోగ్యం నుంచి బయటపడే దశలో ఉంది. తిరిగి రెట్టింపు ఎనర్జీతో, రెట్టింపు ఉత్సాహంతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో మళ్లీ వార్తల్లో నిలుస్తుంది. ఓ వైపు కొంత ట్రోలింగ్‌, మరికొంత క్రేజ్‌తో వైరల్‌ అవుతుంది. ఈ క్రమంలో ఆమెకి సంబంధించిన కొన్ని వార్తలు దుమారం రేపుతున్నాయి. అదేసమయంలో కొన్ని ఇంట్రెస్టింగ్‌గానూ మారాయి. 

26

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రభాస్‌, అల్లు అర్జున్‌, షారూఖ్‌ ఖాన్‌లపై తన అభిప్రాయాన్ని వెళ్లడించింది. ఈ క్రమంలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. ముఖ్యంగా అల్లు అర్జున్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చ లేపుతున్నాయి. 
 

36

ఓ మీడియా చిట్‌ చాట్‌లో యాంకర్‌.. ముగ్గురు హీరోల గురించి ఒక్క మాటల్లో చెప్పాలని, ఎవరంటే క్రష్‌ అనేది వెల్లడించాలని అడిగారు. ఇందులో అల్లు అర్జున్‌ పేరు అడిగాడు. దీనికి ఆమె క్రష్‌ అని వెల్లడించింది. `బార్డరింగ్‌ క్రష్‌` అని చెప్పింది. దీంతో ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. 
 

46

ఇక ప్రభాస్‌, షారూఖ్‌ల గురించి అడగ్గా, ఆసక్తికర కామెంట్లు చేసింది. ప్రభాస్‌, షారూఖ్‌లు అంటూ తనకు రెస్పెక్ట్ అని చెప్పింది. షారూఖ్‌పై తనకు క్రష్‌ లేదని వెల్లడించింది. దీంతో సమంత క్యూట్‌ కామెంట్స్ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 

56

సమంత.. అల్లు అర్జున్‌ కలిసి `సన్నాఫ్‌ సత్యమూర్తి` చిత్రంలో నటించారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఆ తర్వాత `పుష్ప`లో స్పెషల్‌ సాంగ్‌లో సమంత మెరిసిన విషయం తెలిసిందే. `ఊ అంటావా మావ..` పాటలో సమంత, బన్నీ కలిసి వేసిన స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లాయి. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. సినిమాకి హైలైట్‌గా నిలిచింది. 

66
samantha ruth prabhu

సమంత చివరగా `ఖుషి` చిత్రంలో నటించింది. విజయ్‌ దేవరకొండతో కలిసి జోడీ కట్టింది. ఈ మూవీ ఆడియెన్స్ ఆదరణ పొందింది. దీంతోపాటు హిందీలో `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఇది ఈ సమ్మర్‌లోనే విడుదల కాబోతుంది. ఆ తర్వాత ఏడాది రెస్ట్ ని ప్రకటించింది సమంత. అయితే ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆమె సోషల్‌ మీడియాలో, అటు బయట యాక్టివ్‌గా కనిపిస్తుంది. మరి ఈ స్టార్ బ్యూటీ ఏ మూవీతో కమ్‌ బ్యాక్‌ అవుతుందో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories