ఓటీటీలో `హనుమాన్‌`కి నెగటివ్‌ టాక్‌.. ఆ స్టార్‌ హీరో ఫ్యాన్సే కారణమా?.. మళ్లీ వార్‌ షురూ!

Published : Mar 18, 2024, 07:23 AM IST

ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో `హనుమాన్‌` మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ గా నిలచింది. పాన్‌ ఇండియా స్థాయిలో సత్తా చాటింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం దీనికి నెగటివ్‌ టాక్‌ వస్తుంది.   

PREV
17
ఓటీటీలో `హనుమాన్‌`కి నెగటివ్‌ టాక్‌.. ఆ స్టార్‌ హీరో ఫ్యాన్సే కారణమా?.. మళ్లీ వార్‌ షురూ!

సంక్రాంతికి ఎక్కువ సినిమాలు విడుదలవుతుంటాయి. బాగున్న సినిమాలు బాగానే ఆడుతాయి. ఈ సంక్రాంతికి మహేష్‌బాబు `గుంటూరు కారం`, వెంకటేష్‌ `సైంధవ్‌`, నాగార్జున `నా సామిరంగ`, తేజసజ్జ-ప్రశాంత్‌ వర్మల `హనుమాన్‌` విడుదలైంది. ఇందులో మహేష్‌ బాబు మూవీకి మొదటి రోజు నుంచి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. బాగా ట్రోల్‌ అయ్యింది. ఊహించని విధంగా దీన్ని కొందరు పనిగట్టుకుని తొక్కేశారు. బుక్‌మై షోలో దారుణమైన రేటింగ్‌ వచ్చింది. ఇదంతా కొందరు కావాలని చేశారని టీమ్‌ ఆరోపించింది. దీనికితోడు కంటెంట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మూవీ పెద్దగా ఆడలేదు. మరోవైపు వెంకటేష్‌ `సైంధవ్‌` డిజాస్టర్‌గా నిలిచింది. నాగ్‌ `నాసామిరంగ` ఫర్వాలేదు. బాగానే ఆడింది. 
 

27

ఇక చిన్న సినిమాగా, పెద్దగా థియేటర్లు కూడా దక్కని పరిస్థితుల్లో `హనుమాన్‌` మూవీ విడుదలైంది. కానీ ఇది సంచలన విజయం సాధించింది. నెమ్మదిగా పుంజుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఇది సుమారు 300కోట్లు వసూలు చేసి అందరి ఆశ్చర్యపరిచింది. ట్రేడ్‌ వర్గాలకు షాకిచ్చింది. నిర్మాతలు సైతం ఆవాక్కయ్యారు. కంటెంట్‌ ఈజ్‌ కింగ్ అని నిరూపించిన చిత్రమిది. సంక్రాంతి సినిమాల్లోనే ఇది పెద్ద హిట్‌ గా నిలిచింది. వరలక్ష్మి పాత్ర, తేజ సజ్జతోపాటు క్లైమాక్స్ ఎపిసోడ్‌సినిమాకి హైలైట్‌గా నిలిచిందని, ముఖ్యంగా క్లైమాక్సే సినిమాని నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లిందని అందరు అభిప్రాయపడ్డారు. నిజానికి క్లైమాక్స్ కూడా ఆ రేంజ్‌లో ఉంది. 
 

37

అయితే `హనుమాన్‌` మూవీ ఈ నెలలోనే ఓటీటీ(ZEE5)లోకి వచ్చింది. హిందీతో సహా అన్ని వెర్షన్స్ ఇటీవలే విడుదలయ్యాయి. అయితే సినిమాపై నెగటివ్‌ టాక్ వినిపించడం ఆశ్చర్యపరుస్తుంది. ప్రారంభంలో సినిమా క్వాలిటీపై నెగటివ్‌ టాక్‌ వచ్చింది. ప్రింట్‌ అస్సలు బాగలేదని, క్వాలిటీ లేదనే కామెంట్లు వచ్చాయి. మొదటి రెండు మూడు రోజులు దీనిపైనే చర్చ జరిగింది. దీంతో కొందరు క్వాలిటీ లెవల్స్ చూపిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. క్వాలిటీ సెట్‌ చేసుకుంటే బాగుందని అంటున్నారు. 
 

47

ఇప్పుడు మరో రకమైన నెగటివ్‌ టాక్‌ వస్తుంది. సినిమా విషయం లేదంటున్నారు. క్లైమాక్స్ తప్ప సినిమాలు అసలు విషయమే లేదంటున్నారు. క్లైమాక్స్‌ 10 నిమిషాలు పక్కన పెడితే ఇదొక రొటీన్‌ మూవీ అంటున్నారు. హనుమాన్‌ సెంట్‌మెంట్‌ మాత్రమే సినిమాని థియేట్రికల్‌గా నిలబెట్టిందని, అది మినహాయిస్తే సినిమాలో మ్యాటర్‌ లేదంటున్నారు. ఈ క్రమంలో దారుణంగా నెగటివ్‌ టాక్‌ వినిపిస్తుంది. ఎక్కువగా బాగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. 
 

57

థియేట్రికల్‌గా పెద్ద హిట్‌ అయిన ఈ మూవీకి ఓటీటీలో ఇలాంటి నెగటివ్‌ టాక్‌ రావడానికి కారణమేంటనేది ఆశ్చర్యంగా మారింది. అయితే దీనికి కారణం మహేష్‌బాబు ఫ్యాన్స్ అని అంటున్నారు. ఆయన నటించిన `గుంటూరు కారం` మూవీకి ఓటీటీలో పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. దీంతో తమ హీరో సినిమాని కాపాడటం కోసం ఇప్పుడు `హనుమాన్‌`పై నెగటివ్‌ టాక్‌ని స్ప్రెడ్‌ చేస్తున్నారని `హనుమాన్‌` మూవీ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ నెగటివ్‌ టాక్‌కి కారణం ఎవరనే ప్రశ్న వచ్చినప్పుడు మహేష్‌ బాబు అభిమానుల పనే అంటున్నారు. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ వార్‌ మళ్లీ షురూ అయ్యింది. `హనుమాన్‌` మూవీ అభిమానులు, తేజ, ప్రశాంత్‌ వర్మ అభిమానులు మహేష్‌ ఫ్యాన్స్ ని టార్గెట్‌ చేస్తున్నారు. దీంతో నెట్టింట ఇది పెద్ద రచ్చ అవుతుంది. 
 

67

సినిమా ఆడియెన్స్ కి నచ్చితే బాగా ఆడుతుంది. అది థియేటర్‌లో అయినా, ఓటీటీలో అయినా, బాగలేకపోతే పెద్దగా స్పందన ఉండదు. కొందరు హీరోలకు ఓటీటీ ఆదరణ ఉంటుంది, కొందరికి ఉండదు. ఇది సహజమే. అలాగని సినిమా బాగలేదని చెప్పడానికి లేదు. సినిమాకి వచ్చే రెస్పాన్స్ ని బట్టి, వ్యూస్‌ని బట్టి దాని లెక్కేంటో తేలిపోతుంది. అంతేగాని ఇలా బాగుంది, బాగలేదని కొట్టుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిఉండదనేది నిజం. 
 

77

ఇక `హనుమాన్‌` మూవీలో తేజ సజ్జ హీరోగా నటించగా, ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సీక్వెల్‌ ఉంది. `జై హనుమాన్‌` పేరుతో దీన్ని నెక్ట్స్ తెరకెక్కించబోతున్నారు దర్శకుడు. హనుమాన్‌ పాత్ర ప్రధానంగా ఈ మూవీ ఉంటుందట. `హనుమాన్‌` క్లైమాక్స్ లో రాముడికి ఇచ్చిన మాట నెరవేర్చుకునే టైమ్‌ వచ్చింది హనుమాన్‌ అని విభీషణుడు చెబుతాడు. ఆ మాట ఏంటనేది, అదే `జై హనుమాన్‌` స్టోరీ అని తెలుస్తుంది. ఇందులో హనుమాన్‌గా రానా, యష్‌ వంటి కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories