పెళ్లి తర్వాత సమంత నటించిన తొలి సినిమా 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తొలిరోజే రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, తన స్టార్ పవర్ తగ్గలేదని సమంత నిరూపించుకుంది.
సినిమా ఇండస్ట్రీలో 'లేడీ సూపర్ స్టార్'గా పేరున్న సమంత ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేవలం సినిమా సక్సెస్ వల్లే కాదు, ఆమె వ్యక్తిగత జీవితంలోని ఓ పెద్ద మార్పు గురించే ఈ చర్చంతా! అవును, కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో 'మన సామ్ తల్లి కాబోతోందా?' అనే మాట గట్టిగా వినిపిస్తోంది.
27
ఈ మార్పుకు కారణం ఏంటి ?
సాధారణంగా సమంత అంటేనే కొత్త ఫ్యాషన్, గ్లామరస్ డ్రెస్సులకు కేరాఫ్ అడ్రస్. కానీ ఇటీవల 'మా ఇంటి బంగారం' సినిమా ప్రమోషన్లలో ఓ ఆశ్చర్యకరమైన మార్పు కనిపించింది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో ఎక్కడా ఆమె మోడ్రన్ డ్రెస్సులు వేసుకోలేదు!
37
సోషల్ మీడియాలో ప్రశ్నలు
దానికి బదులుగా, అన్నిచోట్లా అందమైన సంప్రదాయ చీరల్లోనే మెరిసింది. దీన్ని గమనించిన నెటిజన్లు, అభిమానులు.. 'సమంత చీర చాటున తన 'బేబీ బంప్' దాచేందుకు ప్రయత్నిస్తోందా?' అని సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తారు. ఈ పుకారు ఇప్పుడు దావానలంలా వ్యాపిస్తోంది.
నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన జీవితంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిధిమోరును ప్రేమించి, గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత గ్లామర్ ప్రపంచానికి కాస్త దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు 'మా ఇంటి బంగారం' చిత్రంతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది.
57
సమంత స్టార్ పవర్
పెళ్లి తర్వాత సమంత నటించిన తొలి సినిమా 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద హవా సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే రూ.10 కోట్లకు పైగా వసూలు చేసి, సమంత స్టార్ పవర్ ఇంకా తగ్గలేదని నిరూపించింది. సినిమా హిట్ అయిన ఆనందానికి తోడు, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వార్తలు కూడా వినిపిస్తుండటంతో అభిమానుల సంతోషం రెట్టింపు అయింది.
67
అధికారిక ప్రకటన లేదు
ప్రస్తుతం వినిపిస్తున్న ఈ ప్రెగ్నెన్సీ వార్తలపై సమంత టీమ్ గానీ, ఆమె భర్త రాజ్ నిడిమోరు గానీ అధికారికంగా స్పందించలేదు. కానీ సినిమా వర్గాల సమాచారం ప్రకారం, సమంత త్వరలోనే ఒక అధికారిక పోస్ట్ ద్వారా ఈ గుడ్ న్యూస్‌ను అభిమానులతో పంచుకోనుందట.
77
మా ఇంటి బంగారంతో కంబ్యాక్
మొత్తానికి, సినిమా విజయం ఒకవైపు అయితే, సమంత త్వరలో తల్లి కాబోతోందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే, సమంత అభిమానులకు ఇంతకంటే పెద్ద పండగ మరొకటి ఉండదు!