Samantha: భర్త రాజ్‌ నిడిమోరు గురించి ఫస్ట్ టైమ్‌ ఓపెన్‌ అయిన సమంత.. మా ఇంటి బంగారం ట్రైలర్‌ ఎలా ఉందంటే?

Published : May 26, 2026, 08:10 AM IST

సమంత ప్రధాన పాత్రలో నటించిన `మా ఇంటి బంగారం` మూవీ ట్రైలర్‌ వచ్చింది. సమంత యాక్షన్‌ అదిరిపోయింది. ఇందులో ఆమె భర్త రాజ్‌ నిడిమోరు గురించి ఓపెన్‌ అయ్యింది. 

PREV
15
మా ఇంటి బంగారం ట్రైలర్‌ వచ్చింది

సమంత, దర్శకుడు రాజ్‌ నిడిమోరు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత రాజ్‌ నిడిమోరు ప్రేమలో పడింది సమంత. వీరిద్దరు కొంత కాలం ప్రేమించుకుని ఇటీవలే ఒక్కటయ్యారు. మ్యారేజ్‌ చేసుకున్నారు. మ్యారేజ్‌ తర్వాత వీరిద్దరు కలసి `మా ఇంటి బంగారం` సినిమా చేశారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రాజ్‌ నిడిమోరు కథ అందించడంతోపాటు డైలాగ్‌లు, స్క్రీన్‌ ప్లే అందించారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. సమంత, రాజ్‌ నిడిమోరు నిర్మించారు. ఈ మూవీ జూన్‌ 19న విడుదల కానుంది. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. సోమవారం ఐమాక్స్ లో దీన్ని ప్రదర్శించారు.

25
భర్త రాజ్‌ నిడిమోరుపై సమంత కామెంట్‌

ఈ సందర్భంగా సమంత తన భర్త గురించి ఓపెన్ అయ్యింది. యాంకర్‌ రాజ్‌ నిడిమోరు ఇబ్బంది పెట్టిన సందర్భం ఏంటి అని అడగ్గా, అలాంటిది ఏం లేదని, ఆయన ఎప్పుడూ ఇరిటేట్‌ చేయలేదని తెలిపింది. నందిని రెడ్డి గురించి చెబుతూ, రాజ్‌ నిడిమోరు, నందిని ఇద్దరూ పర్‌ఫెక్ట్ అని, నందిని రెడ్డి ఇరిటేట్‌ చేయడం కొత్తగా ఏం లేదని, 15ఏళ్లుగా భరిస్తూనే ఉన్నానని, అలవాటు అయిపోయిందని చెప్పింది సమంత. ఈ ఈవెంట్‌లో ఓ అభిమాని ఆమెకి ఫ్లవర్‌ ఇచ్చి ప్రపోజ్‌ చేయడం హైలైట్‌గా నిలిచింది.

35
మా ఇంటి బంగారం సినిమాపై సమంత కామెంట్‌

ఇంకా సమంత మాట్లాడుతూ, మా ఇంటి బంగారం’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. మా కోసం ఇక్కడికి వచ్చిన ప్రతీ ఒక్క అభిమానికి థాంక్స్. నందినీ, రాజ్ ప్రతీ విషయంలో పర్ ఫెక్ట్‌గా ఉంటారు. ఇంత వరకు నేను వారితో వాదించే విషయం గానీ, అలాంటి ఓ ఘటన గానీ ఎదురు కాలేదు. ‘మా ఇంటి బంగారం’లో ప్రతి ఎమోషన్ ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉంటుంది. యాక్షన్, డ్రామా, కామెడీ అన్ని అంశాలుంటాయి. జూన్ 19న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి. అభిమానులంతా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’ అని అన్నారు.

45
మా ఇంటి బంగారం ట్రైలర్‌ ఎలా ఉందంటే?

మరి మా ఇంటి బంగారం ట్రైలర్‌ ఎలా ఉందనేది చూస్తే, సమంత నుంచి నెక్ట్స్ లెవల్‌ మూవీ రాబోతుందని చెప్పొచ్చు. ఒక ఉమ్మడి కుటుంబంలోకి కోడలిగా వచ్చిన సమంత.. అక్కడ పద్ధతులు, ఆచారాలు తెలియక ఇబ్బంది పడుతుంది. దాన్ని మ్యానేజ్‌ చేయడానికి నానా కష్టాలు పడుతుంది. ఇంట్లో కనిపించే సమంత వేరు, బయట అసలు స్వరూపం వేరు. ఆమె తమ ఫ్యామిలీని కాపాడుకోవడానికి హీరోల పోరాడుతుంది. ప్రత్యర్థులను చెడుగుడు ఆడుకుంటుంది. అయితే మొదట సమంత ఎవరు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని పెళ్లి చూపులకు వచ్చిన వ్యక్తి అడగ్గా, సమంత చేసే యాక్షన్‌తో ట్రైలర్‌ ప్రారంభం కావడం విశేషం.

55
హీరో అయినా, హౌజ్‌ వైఫ్‌ అయినా డైలాగ్‌ కరెక్ట్ గా పడితే ఎవడైనా బెదరాల్సిందే

నేనేవరో నీకు తెలుసా? అసలు నేనెవరో నీకు తెలుసా? అని సమంత గట్టిగా ఆ వ్యక్తికి కౌంటర్‌ ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది. అనంతరం తన భర్తతో బస్‌లో ప్రయాణించడం, తమ అభిప్రాయాలు పంచుకోవడంతో సాగుతుంది. అత్తారింటికి వెళ్లినప్పుడు వాళ్లు అడిగే ప్రశ్నలకు తికమక పడుతుంది సమంత. అది భరించలేక.. ఏదో దొంగని పట్టుకొని అడిగినట్టు అడిగారు ప్రశ్నలు అంటూ భర్త వద్ద వాపోయింది. పద్ధతిగా ఉండటం, వంటచేయడం రాదు అని బాధపడిన ఆమె, తనలో ఒక్కటైతే ఉందండి, నా ప్రాణం అడ్డుపెట్టైనా నా ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకుంటానని చెప్పే డైలాగ్‌ అదిరిపోయింది. ఇక వరుసగా సమంత యాక్షన్‌ షురూ అవుతుంది. ఈ క్రమంలో `హీరో అయినా, హౌజ్‌ వైఫ్‌ అయినా, డైలాగ్‌ కరెక్ట్ గా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే` అని చెప్పే డైలాగ్‌ మాస్‌ ఆడియెన్స్ కి ఫీస్ట్ లా ఉంది. ట్రైలర్‌ అదిరిపోయింది. సమంత తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్‌ ఇవ్వబోతుందని మాత్రం అర్థమవుతుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories