Samantha: షాకిస్తున్న సమంత నెక్ట్స్ మూవీస్‌ లైనప్‌.. అక్కడ నాలుగు.. మొత్తం తొమ్మిది.. ఇక ఫ్యాన్స్ కి పండగే

Published : Jul 06, 2022, 03:40 PM ISTUpdated : Jul 06, 2022, 06:31 PM IST

ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తున్న సమంత.. సెలైంట్‌గా వరుస సినిమాలకు సైన్‌ చేస్తుంది. తాజాగా ఆమె నెక్ట్స్ సినిమాల లైనప్‌ చూస్తుంటే మతిపోయేలా ఉంది. ప్రస్తుతం ఇదే హాట్‌ టాపిక్‌ కావడం విశేషం. 

PREV
19
Samantha: షాకిస్తున్న సమంత నెక్ట్స్ మూవీస్‌ లైనప్‌.. అక్కడ నాలుగు..  మొత్తం తొమ్మిది.. ఇక ఫ్యాన్స్ కి పండగే

సమంత(Samantha) జోరు మామూలుగా లేదు. ఆమె అభిమానులకు షాకిచ్చేలా ఉంది. తాజాగా ఆమె సినిమాల లైనప్‌ చూస్తుంటే మతిపోతుంది. ఏకంగా తొమ్మిది సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాదు బాలీవుడ్‌లోనే ఆమె నాలుగు సినిమాలకు కమిట్‌ కావడం షాక్‌కి గురి చేస్తుంది. టాలీవుడ్‌ మేకర్స్ ని సైతం నోరెళ్లబెట్టేలా చేస్తుంది. 
 

29

నాగచైతన్యతో విడాకుల ముందు సమంత కమిట్‌ అయ్యింది కేవలం `శాకుంతలం` (Shaakuntalam) మాత్రమే. అదొక్కటే అప్పటికే చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది. మిగిలిన సినిమాలేవి అధికారికంగా ప్రకటించలేదు. అప్పటి చాలా ప్రాజెక్ట్ లకు చర్చలు జరుగుతున్నట్టు వార్తలొచ్చాయి. కానీ ఏదీ క్లారిటీ లేదు. డైవర్స్ తర్వాత సమంత బర్త్ డే సందర్బంగా ఆమె మూడు సినిమాలను ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేసింది. 

39

తెలుగులో ఆమె `యశోద`(Yashoda) చిత్రాన్ని ప్రకటించారు. దీన్ని బైలింగ్వల్‌గానే అనుకున్నారు. కానీ తర్వాత పాన్‌ ఇండియా చిత్రంగా మలిచారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ ఆకట్టుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో సరికొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతుందని అర్థమయ్యింది. ఇందులో సమంత లుక్‌ కూడా కొత్తగా ఉండటం విశేషం. ఈ చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేసినట్టు సమాచారం. 

49

మరోవైపు విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda)తో కలిసి `ఖుషి`(Khushi) సినిమాలో నటిస్తుంది సమంత. పవన్‌ కళ్యాణ్‌ క్లాసిక్ `ఖుషి` సినిమా ఇన్సిపిరేషన్‌తో ఈ టైటిల్‌ని పెట్టినట్టు సమాచారం. దీనికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఇది శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈచిత్రాన్ని పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. `లైగర్‌` చిత్రంతో విజయ్‌ దేవరకొండకి పాన్‌ ఇండియా ఇమేజ్‌రాబోతుంది, మరోవైపు సమంత కూడా బాలీవుడ్‌ సినిమాలకు కమిట్‌ అవ్వడం, ఇప్పటికే `ది ఫ్యామిలీ మ్యాన్‌ 2`తో ఆమెకి నార్త్ లో మార్కెట్ ఏర్పడింది. దీంతో పాన్‌ ఇండియాగా రిలీజ్‌ చేయబోతున్నారు. 

59

వీటితోపాటు సమంత తెలుగు, తమిళంలో ఓ బైలింగ్వల్‌ చిత్రం చేయాల్సి ఉంది. డ్రీమ్‌ వారియర్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే ఇది ఇంకా ప్రారంభం కాలేదు. అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు శాంత రూబెన్‌ దర్శకత్వం వహించనున్నారు. సమంత బర్త్ డే సందర్భంగా ప్రకటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఇంకా ఎలాంటి అప్‌డేట్‌ లేదు. 

69

మరోవైపు ఓ అంతర్జాతీయ సినిమా చేస్తుంది సమంత. `ది అరెంజ్‌మెంట్‌ ఆఫ్ లవ్‌` అనే మూవీకి కమిట్‌ అయ్యింది. ఇది 2004లో పబ్లిష్‌ అయిన పుస్తకం ఆధారంగా హాలీవుడ్‌ దర్శకుడు ఫిలిప్‌ జాన్‌ రూపొందిస్తున్నారు. బైసెక్స్వల్‌ తమిళ మహిళ లైఫ్‌ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో బైసెక్స్వల్‌ అమ్మాయిగా సమంత కనిపించనున్నారు. 

79

మరోవైపు బాలీవుడ్‌ ఎంట్రీకి కూడా సమంత లైన్‌ క్లీయర్ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఆయుష్మాన్‌ ఖురానాతో ఓ సినిమాకి కమిట్‌ అయ్యిందని సమాచారం. కానీ లేటెస్ట్‌ న్యూస్‌ ప్రకారం సమంత నాలుగు హిందీ ప్రాజెక్ట్ లకు సైన్‌ చేసిందట. అందులో ఒకటి ఆయుష్మాన్‌ ఖురానా మూవీ అని సమాచారం. దినేష్‌ విజన్‌ నిర్మించే ఈ చిత్రానికి దర్శకుడెవరనేది తెలియాల్సి ఉంది. దీన్ని ఈ ఏడాది ప్రారంభించి, వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయబోతున్నారట. దీంతోపాటు ఓ మైథలాజికల్ మూవీకి కమిట్‌ అయ్యారట సమంత. 

89

ఈ రెండు చిత్రాలతోపాటు తాప్సీ ప్రొడక్షన్‌లోనూ ఓ సినిమా చేయబోతుందట. ఇటీవల `శభాష్‌ మిత్తు` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తాప్సీ ఈ విషయాన్ని తెలిపింది. సమంతతో తన ప్రొడక్షన్‌లో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలిపింది. అలాగే అక్షయ్‌ కుమార్‌తోనూ ఓ సినిమాకి కమిట్‌ అయినట్టు సమాచారం. ఇటీవల వీరిద్దరు కలిసి `కాఫీ విత్‌ కరణ్‌` షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. రేపటి నుంచి ఈ షో స్ట్రీమింగ్ కానుంది. 

99

అలాగే ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేయబోతుందట సమంత. వరుణ్‌ ధావన్‌తో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేయబోతున్నట్టు సమాచారం. ఈ వార్త చాలా రోజుల క్రితం నుంచే వినిపిస్తుంది. కానీ తాజాగా అది ఫైనల్‌ అయ్యిందని తెలుస్తుంది. ఈ వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తంగా సమంత.. నాలుగు పాన్‌ ఇండియా చిత్రాలు, నాలుగు హిందీ ప్రాజెక్ట్ లు, ఓ ఇంటర్నేషనల్‌ మూవీతో ఆమె నెక్ట్స్ సినిమాల లైనప్‌ షాకిచ్చేలా ఉందని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories