తమిళ స్టార్ హీరోతో నాలుగో సారి జతకట్టనున్న సమంత, ఈ సారి మాత్రం..?

Published : Jun 04, 2022, 11:52 AM ISTUpdated : Jun 04, 2022, 11:53 AM IST

స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. సమంత తోటి హీరోయిన్లు ఫెయిడ్ అవుట్ అవుతుంటే.. సామ్ మాత్రం ఎక్కువ అవకాశాలు సాధించుకుంటోంది. ఇక తమిళ స్టార్ హీరోతో నాలుగో సారి జతకట్టబోతోంది. 

PREV
15
తమిళ స్టార్ హీరోతో నాలుగో సారి జతకట్టనున్న సమంత, ఈ సారి మాత్రం..?

తెలుగులో వరుస చిత్రాలతో దూసుకెళ్తుంది సమంత. శాకుంతలం, యశోద, ఖుషి సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్న సామ్‌ తాజాగా ఓ తమిళ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని టాక్‌. 

25

కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా నటించనున్న 67వ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందట సమంత. మాస్టర్‌ లాంటి హిట్‌ సినిమాల తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా ఈ సినిమా రూపొందనుంది. ఈ చిత్రంలో విజయ్‌కి జోడీగా సమంత ఫిక్స్‌ అయిందని సమాచారం. 

35

కత్తి, తేరి, మెర్సల్‌ ఈ మూడు సినిమాలలో దళపతి విజయ్ కు జోడీగా నటించింది సమంత.  ఈ సినిమాలతో మంచి జోడీ అనిపించుకున్నారు విజయ్‌-సమంత. ఇక ఇప్పుడు లోకేష్ కనగరాజ్ సినిమాలో నటిస్తే వీరిద్దరూ నాలుగోసారి జత కట్టినట్లు అవుతుంది. 

45

లోకేశ్‌ కనగరాజ్ ఇంతకు ముందు సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు పెద్దగా స్కోప్ ఉండేది కాదు.. ఆయన గత  సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో  హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యత ఉందని సమాచారం. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 
 

55

ఇదిలా ఉంటే.. సమంత లీడ్‌ రోల్‌లో నటించిన శాకుంతలం, యశోద సినిమాలు షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు  సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు సమంత  విజయ్‌ దేవరకొండ జోడీగా శివనిర్వాణ డైరెక్షన్ లో ఖుషి  సినిమాలో నటిస్తోంది. ఈసినిమా షూటింగ్‌ జోరుగా  జరుగుతోంది. 
 

click me!

Recommended Stories