నేచురల్‌ అందాలతో సమంత మార్నింగ్‌ వాక్‌.. తన హ్యాపీ ప్లేస్‌ రివీల్‌ చేస్తూ కిర్రాక్‌ షో..

Published : Aug 23, 2023, 11:55 AM IST

సమంత ఒక సంచలనం. ఒక సాధారణ హీరోయిన్‌గా చిత్ర పరిశ్రమకి పరిచయమై ఇప్పుడు ఇండియన్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచింది.   

PREV
17
నేచురల్‌ అందాలతో సమంత మార్నింగ్‌ వాక్‌.. తన హ్యాపీ ప్లేస్‌ రివీల్‌ చేస్తూ కిర్రాక్‌ షో..

సమంత సినిమాలకు ఏడాది బ్రేక్‌ని ప్రకటించింది. ఆమె ప్రస్తుతం వెకేషన్‌లో ఉంది. పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని భావిస్తుంది. తన అనారోగ్య సమస్యలను అధిగమించి మళ్లీ మామూలు స్థితికి చేరుకోవాలనుకుంటుంది. ఓ వైపు ఆథ్యాత్మిక సేవలో మునిగి తేలుతుంది. మరోవైపు ప్రకృతిలో పరవశించిపోతుంది. 
 

27

సమంత.. ప్రస్తుతం అమెరికాలో ఉంది. అక్కడ మార్నింగ్ వాక్‌ చేస్తూ ఫిట్‌నెస్‌ని పొందుతుంది. న్యూయార్క్ లోని సెంట్రల్‌ పార్క్ లో మార్నింగ్‌ వాక్‌ చేస్తూ దిగిన ఫోటోలను పంచకుంది సమంత. ఇందులో వర్కౌట్‌ లుక్‌లో కనిపించింది. టైట్‌ బ్రా, షాట్‌ ధరించింది. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు సమంత అందాలు ముద్దాడగా ఆమె పరవశించిపోతుంది. 

37

ఈ సందర్భంగా తనకిష్టమైన ప్లేస్‌ని పంచుకుంది సమంత. ఇదే తన హ్యాపీ ప్లేస్‌అని చెప్పింది. పార్క్ లోని చైర్స్ పై కూర్చొని రిలాక్స్ అవుతుంది. తన పాత జ్ఞాపకాలను నెమరేసుకుంటుంది. అదే సమయంలో ఉమెన్ రైట్స్ పాయినీర్‌ వద్ద అలా చూస్తూ ఉండిపోయింది. మరోవైపు పార్క్ లోని గ్రీనరీని ఆస్వాధిస్తూ ఆలోచనలో మునిగిపోయింది.
 

47

ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అభిమానులను అలరిస్తున్నాయి. దీనిపై ఫ్యాన్స్ రియాక్ట్ అవుతూ, సమంత క్యూట్‌గా ఉందని, సమంత ఓవర్‌ లోడ్‌ అని, మార్నింగ్‌ వాక్‌లో ఎంత ముద్దుగా ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు. రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు. 

57

సమంత.. గతేడాది మయోసైటిస్‌ వ్యాధికి గురైన విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలలపాటు ఆ అరుదైన వ్యాధితో పోరాడింది. కోలుకుంది. కానీ దాని తాలుకూ ప్రభావం ఇంకా ఉంది. హెల్త్ ఇష్యూస్‌ వస్తూనే ఉన్నాయి. అందుకే ఆమె తరచూ ఇబ్బంది పడుతుంది. దాన్నుంచి పూర్తిగా కోలుకునేందుకు, రెట్టింపు ఎనర్జీని పొందేందుకు సమంత ఈ గ్యాప్‌ తీసుకుంది. 
 

67

అందులో భాగంగా తాను చేయాల్సిన సినిమా షూటింగ్‌లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఆమె విజయ్‌ దేవరకొండతో `ఖుషి` చిత్రంలో నటిస్తుంది. వరుణ్‌ ధావన్‌తో `సిటాడెల్‌` వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. ఈ సినిమాల షూటింగ్‌ని ఇటీవలే పూర్తి చేసుకుంది. దీంతో ఆమె బ్రేక్‌ తీసుకుంది.

77

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న `ఖుషి` సినిమా సెప్టెంబర్‌ 1న విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. లవ్‌, రొమాంటిక్‌, ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్‌ కావాలని అటు విజయ్‌, సమంతలతోపాటు దర్శకుడు శివ నిర్వాణ చూస్తున్నారు. ఈ ముగ్గురికిఈ సినిమా చాలా కీలకమని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories