బిగ్ బాస్ హౌస్లోకి ఆ స్టార్ హీరోయిన్... చివరి నిమిషంలో సడన్ ఎంట్రీ?

Published : Aug 23, 2023, 11:16 AM IST

బిగ్ తెలుగు 7కి రంగం సిద్ధమైంది. కొద్దిరోజుల్లో షో మొదలుకానుంది. కంటెస్టెంట్స్ లిస్ట్ పై సమాచారం బయటకు వస్తుంది. ఈసారి ఓ హీరోయిన్ సైతం ఎంపిక చేశారట. 

PREV
16
బిగ్ బాస్ హౌస్లోకి ఆ స్టార్ హీరోయిన్... చివరి నిమిషంలో సడన్ ఎంట్రీ?
Bigg Boss Telugu 7

పాప్యులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సెప్టెంబర్ 3 నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు. వరుసగా ఐదో సీజన్ కి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తి అయ్యింది. కొందరి పేర్లు లీక్ అయ్యాయి. 

26

సడన్ గా ఈ లిస్ట్ లో హీరోయిన్ ఫర్జానా పేరు వినిపిస్తుంది. చివరి నిమిషంలో ఫర్జానాను మేకర్స్ ఎంపిక చేశారట. ఒకప్పటి ఈ క్రేజీ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫర్జానా ఎంట్రీతో గ్లామర్ డోస్ పెరిగే అవకాశం కాలేదంటున్నారు. 

 

36

ఫర్జానా 2006లో వెండితెరకు పరిచయమైంది. ఆమె మొదటి చిత్రం భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా. అనంతరం నరేష్ కి జంటగా సీమశాస్త్రి చిత్రంలో నటించారు. ఇది హిట్ టాక్ తెచ్చుకుంది. అనంతరం ఇదే కాంబినేషన్ లో బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్ మూవీ విడుదలైంది. ఈ చిత్రం కూడా విజయం సాధించింది. 

46


వరుసగా చిత్రాలు చేస్తున్న ఫర్జానా సడన్ గా పరిశ్రమకు దూరమైంది. 2009లో 1977 టైటిల్ తో ఒక తమిళ చిత్రం చేసింది. ఈ చిత్రం అనంతరం ఆమె యాక్టింగ్ వదిలేశారు. మళ్ళీ ఇన్నేళ్లకు మీడియాలో ఆమె పేరు వినిపిస్తోంది. బిగ్ బాస్ షోలో సందడి చేయనుందని అంటున్నారు. 

56

అలాగే అబ్బాస్ పేరు కూడా వినిపిస్తోంది. న్యూజిలాండ్ దేశంలో ఉంటున్న అబ్బాస్ ఇటీవల ఇండియా వచ్చారు. వరుస ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ప్రేమదేశం మూవీతో భారీ ఫేమ్ తెచ్చుకున్న అబ్బాస్ తర్వాత ఫేడ్ అవుట్ అయ్యాడు. కాగా ఆయన కూడా బిగ్ బాస్ 7కి ఎంపికయ్యాడంటూ ప్రచారం జరుగుతుంది. 

66


ఈటీవి ప్రభాస్, అమర్ దీప్ చౌదరి, ఆయన భార్య తేజస్విని, నటి సురేఖావాణి సైతం ఈ లిస్ట్ లో ఉన్నారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఏది ఏమైనా గ్రాండ్ లాంచ్ ఈవెంట్ రోజే దీనిపై స్పష్టత వస్తుంది. అప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories