Samantha: వాటికి దూరంగా ఉంటా.. ప్రేమపై సమంత షాకింగ్ కామెంట్స్, ఇక ఆ ఉద్దేశం లేదా ?

Published : Apr 30, 2022, 06:12 PM IST

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

PREV
16
Samantha: వాటికి దూరంగా ఉంటా.. ప్రేమపై సమంత షాకింగ్ కామెంట్స్, ఇక ఆ ఉద్దేశం లేదా ?

నాగ చైతన్యతో బ్రేకప్ తర్వాత సమంత బాగా బిజీగా మారిపోయింది. బాలీవుడ్ లో కూడా నటించేందుకు సామ్ రెడీ అవుతోంది. సమంత ఇటీవల నటించిన కన్మణి రాంబో ఖతీజా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఎలాంటి బజ్ క్రియేట్ చేయలేకపోయింది. క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి సరైన స్పందన రాలేదు. 

26
samantha

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి జంటగా సమంత, నయనతార నటించారు. ఇదిలా ఉండగా సమంత ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. సమంత తన ఫ్యాన్స్ లో సోషల్ మీడియాలో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సామ్ సమాధానాలు ఇచ్చింది. 

36
samantha

ఓ అభిమాని మాట్లాడుతూ.. ప్రేమని, ద్వేషాన్ని ఒకేసారి పొందుతున్నారు ఎలా అనిపిస్తోంది ? అని ప్రశ్నించాడు. దీనికి సామ్ బదులిస్తూ.. ప్రేమని కానీ, ద్వేషాన్ని కాని నేను కొనాలని అనుకోవట్లేదు. వాటికి దూరంగా సేఫ్ గా ఉండాలని అనుకుంటున్నా అంటూ సమంత సంచలన వ్యాఖ్యలు చేసింది. 

46
samantha

సమంత కామెంట్స్ తో కొత్త చర్చ మొదలైంది. సమంతకు ప్రేమపై నమ్మకం పోయిందా అని చర్చించుకుంటున్నారు. సమంత, నాగ చైతన్య చాలా కాలం ప్రేమించుకుని 2017లో వివాహం చేసుకున్నారు. 

56
samantha

నాలుగేళ్ళ వైవాహిక జీవితం తర్వాత గత ఏడాది సామ్, చైతు విడిపోయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరికొందరు అభిమానులు నయనతారతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని ప్రశ్నించారు. నయనతార ఎప్పటికి నయనతారే.. ఆమె హార్డ్ వర్కింగ్ పర్సన్ అని సమంత ప్రశంసించింది. 

66
samantha

సమంత ప్రస్తుతం యశోద, పౌరాణిక చిత్రం శాకుంతలం చిత్రాల్లో నటిస్తోంది. శాకుంతలంపై మంచి అంచనాలు ఉన్నాయి. సమంత తొలిసారి పౌరాణిక చిత్రంలో నటిస్తుండడంతో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకుడు. 

Read more Photos on
click me!

Recommended Stories