మెహరీన్‌కి వరుస ప్లాప్స్ ఎదురయ్యాయి. `కేర్ ఆఫ్ సూర్య`, `జవాన్`, `పంతం`, `కవచం`... ఇలా వరుసగా ఆమె నటించిన చిత్రాలు ఢమాల్ అన్నాయి. అయితే 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన `ఎఫ్ 2` తో బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఇచ్చింది. కానీ తర్వాత వచ్చిన `చాణక్య`, `ఎంత మంచివాడవురా`, `పట్టాస్`, `అశ్వథ్థామ`, `మంచి రోజులొచ్చాయి` చిత్రాలు బోల్తా కొట్టాయి. మళ్లీ మొదటికొచ్చింది ఈ అమ్మడి వ్యవహారం. దీంతో ఇప్పుడు `ఎఫ్ 3`పైనే ఆశలు పెట్టుకుంది.