Lavanya Tripathi: సడన్ గా ఫారిన్ లో ప్రత్యక్షమైన లావణ్య... నవ్వులు చిందిస్తూ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అలా... 

Published : Apr 30, 2022, 05:18 PM ISTUpdated : Apr 30, 2022, 05:19 PM IST

సడన్ గా ఫారిన్ లో ప్రత్యక్షమైంది లావణ్య త్రిపాఠి. ఇస్తాంబుల్ నగరంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది. నవ్వులు పోయిస్తూ, అందంతో మెరిసిపోతున్న గ్లామరస్ ఫోటోలను లావణ్య షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

PREV
110
Lavanya Tripathi: సడన్ గా ఫారిన్ లో ప్రత్యక్షమైన లావణ్య... నవ్వులు చిందిస్తూ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అలా... 
Lavanya Tripathi

సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న లావణ్య (Lavanya Tripathi) వెకేషన్ లో సేద తీరుతున్నట్లు అర్థమవుతుంది. ఇక ఆనందంగా ఉండడానికి అనేక కారణాలున్నాయి. వాటిని కనిపెట్టండి... అంటూ ఓ కొటేషన్ కొట్టింది.

210
Lavanya Tripathi

మరో వైపు కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది.  టాలెంటెడ్ యాక్ట్రెస్ అన్న ఇమేజ్ తో పాటు సూపర్ హిట్ సినిమాలలో నటించినప్పటికీ టాలీవుడ్ లో నిలదొక్కుకోలేక పోయింది. వరుస పరాజయాలు ఆమె అవకాశాలను దెబ్బతీశాయి.

310
Lavanya Tripathi

ఆఫర్స్ తగ్గడంతో లావణ్య గ్లామర్ షోకి తెరలేపుతున్నారు. హోమ్లీ హీరోయిన్ గా ఆ తరహా పాత్రలే చేసిన లావణ్య ఇప్పుడు పంథా మార్చారు. తనలోని హాట్ నెస్ ని పరిచయం చేస్తూ ఫోటో షూట్స్ చేస్తుంది.

410

సోషల్ మీడియా వేదికగా లావణ్య గ్లామరస్ ఫోటో షూట్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఆమెలోని కొత్త యాంగిల్ చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు. అవకాశాల కోసం లావణ్య కొత్త అవతారం ఎత్తినట్లు అనిపిస్తుంది. స్కిన్ షోకి తెరలేపుతూ ఎలాంటి పాత్రకైనా సిద్దమే అన్న సందేశం దర్శక నిర్మాతలకు పంపుతుంది.
 

510


లావణ్య మొదటి చిత్రం అందాల రాక్షసి. ట్రై యాంగిల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన అందాల రాక్షసి చిత్రంలో లావణ్య నటన అద్భుతం. అల్లరి పిల్లగా లావణ్య అదరగొట్టేసింది. ఆ సినిమాతో లావణ్య ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.
 

610

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి వరుస హిట్స్ దక్కినా, హీరోయిన్ గా బిజీ కాలేకపోయారు. నాగార్జునను మినహాయిస్తే టూ టైర్ హీరోలతోనే లావణ్య కెరీర్ సాగింది. కెరీర్ బిగినింగ్ లో హిట్ సినిమాలలో నటించి కూడా పునాది వేసుకోలేకపోయింది. టాలెంట్ ఉన్నా లక్ లేక రేసులో వెనుకబడిపోయింది.

710


ఒక్క స్టార్ హీరో పక్కన కూడా లావణ్యకు ఆఫర్ రాలేదు. అర్జున్ సురవరం మూవీతో ఫార్మ్ లోకి వచ్చింది అనుకుంటే... ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలు చావు దెబ్బతీశాయి. ఈ రెండు చిత్రాలు పరాజయం కావడంతో లావణ్య కెరీర్ మరింత దెబ్బతింది.
 

810

  ఆ మధ్య మెగా కోడలు పుకార్లతో వార్తల్లోకి ఎక్కింది లావణ్య త్రిపాఠి. హీరో వరుణ్ తేజ్ (Varun Tej) లావణ్యపై మనసు పడ్డారని, ఏకంగా విలువైన ఓ డైమండ్ రింగ్ తీసుకొని లావణ్య త్రిపాఠికి ప్రపోజ్ చేయడానికి బెంగుళూరు వెళ్లాడని కథనాలు వెలువడ్డాయి. పొగ లేకుండా గుప్పుమన్న ఈ వార్త సంచలనం రేపింది. 
 

910

 రాజస్థాన్ లో జరిగిన నిహారిక వెడ్డింగ్ కి కేవలం లావణ్య , రీతూ వర్మ మాత్రమే హాజరయ్యారు. ఫ్యామిలీ హీరోలతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్న నిహారిక పెళ్లి వేడుకలో లావణ్య మెరిశారు.
 

1010

అలాగే యంగ్ హీరో కార్తికేయ సరసన చావుకబురు చల్లగా చిత్రంలో లావణ్య హీరోయిన్ గా చేస్తున్నారు. 
 

ప్రస్తుతానికి వరుణ్, లావణ్య పెళ్లి వార్తలు సద్దుమణిగాయి. అయితే వీరిద్దరూ పెళ్లి చేసుకునే అవకాశాలు కొట్టిపారేయలేం అంటున్నారు. మరి దేనికైనా కాలమే సమాధానం చెబుతుంది. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్లి ప్రకటన చేసే వరకు ఈ రూమర్స్ కి తెరపడదు.

click me!

Recommended Stories