చిరునవ్వులు చిందిస్తూ అందాలు ఆరబోస్తూ బాలిలో ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న సమంత.. ఫొటోస్

Published : Jul 31, 2023, 03:36 PM IST

సినిమాల నుంచి ఏడాది పాటు బ్రేక్ తీసుకోవడంతో సమంత ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. సమంతకి మళ్ళీ ఏమైంది అంటూ కాస్త ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. కానీ సమంత మాత్రం తన స్నేహితురాలితో కలసి బాలి  వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.   

PREV
16
చిరునవ్వులు చిందిస్తూ అందాలు ఆరబోస్తూ బాలిలో ఒక రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్న సమంత.. ఫొటోస్

గత రెండేళ్లుగా సమంతకి సంబంధించిన చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైతన్యతో విడాకుల తర్వాత డిప్రెషన్ కి గురైన సమంత తిరిగి తన సినిమాలతో బిజీగా మారింది. అంతలోనే ఆమెని మయో సైటిస్ అనే వ్యాధి చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. 

26

విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని కాస్త కోలుకుంది. చకచకా యశోద, శాకుంతలం చిత్రాలు పూర్తి చేసిన సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ కూడా ఫినిష్ అయింది. అయితే సమంత ఒక ఏడాది సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించింది. 

36

ప్రస్తుతం సమంత యోగ, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ బిజీగా ఉంది. సినిమాల నుంచి ఏడాది పాటు బ్రేక్ తీసుకోవడంతో సమంత ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. సమంతకి మళ్ళీ ఏమైంది అంటూ కాస్త ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. 

46

అయితే సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటోంది. తాను ఎక్కడికి వెళ్లినా ఆ విశేషాలని ఫ్యాన్స్ తో పంచుకుంటోంది.  ప్రస్తుతం సమంత తన స్నేహితురాలితో కలసి బాలి  వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. 

56

షూటింగ్స్ కి ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన సమంత కంప్లీట్ గా తన హెల్త్ పైనే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఆరోగ్యం పూర్తిగా కుదుటపడేవరకు ఎలాంటి టెన్షన్స్ లేకుండా సంతోషంగా గడపాలని సమంత భావిస్తోందట. 

66

తాజాగా సమంత బాలిలో సముద్ర తీరాన అలల మధ్య చిలికిగా గడుపుతూ.. చిరునవ్వులు చిందిస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. అక్కడ ఉన్న ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ సమంత ప్రశాంతంగా గడుపుతోంది. అలాగే అక్కడ ఉల్వటులో టెంపుల్ ని కూడా సమంత సందర్శించింది. 

click me!

Recommended Stories