'గుండమ్మ కథ' రీమేక్ చేయాలనుకున్న జూ. ఎన్టీఆర్, నాగ చైతన్య.. ఏఎన్నార్ అడిగిన తొలి ప్రశ్న ఇదే ?

అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం లాంటి లెజెండ్రీ నటీనటులంతా కలసి నటించిన చిత్రం గుండమ్మ కథ. టాలీవుడ్ చరిత్రలో గుండమ్మ కథ చిత్రం క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. క్లాసిక్ చిత్రాలకు రీమేక్స్ తెరకెక్కించాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి.

NTR and Naga Chaitanya wants to do Gundamma Katha remake, here is ANR reaction in telugu dtr
Jr NTR, Naga Chaitanya

అక్కినేని నాగేశ్వర రావు, ఎన్టీఆర్, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం లాంటి లెజెండ్రీ నటీనటులంతా కలసి నటించిన చిత్రం గుండమ్మ కథ. టాలీవుడ్ చరిత్రలో గుండమ్మ కథ చిత్రం క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. క్లాసిక్ చిత్రాలకు రీమేక్స్ తెరకెక్కించాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి. గుండమ్మ కథ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ మనవడు నాగ చైతన్య గతంలో ప్రయత్నాలు చేశారు. 

NTR and Naga Chaitanya wants to do Gundamma Katha remake, here is ANR reaction in telugu dtr
Jr NTR

ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలని నాగార్జున కూడా తారక్, చైతులకు సాయం చేసేందుకు ప్రయత్నించారట. దీని గురించి నాగార్జున ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గుండమ్మ కథ రీమేక్ పై పెద్ద ఎత్తున చర్చలు జరిగినట్లు మురళి మోహన్ కూడా తెలిపారు. అందరూ ఒకే అనుకున్న తర్వాత అక్కినేని నాగేశ్వర రావు ఒపీనియన్ తీసుకోవాలని ఆయనకి చెప్పారు. 


Sr NTR, ANR

గుండమ్మ కథ రీమేక్ చేసేందుకు ఏఎన్నార్ అడ్డు చెప్పలేదు. కానీ ఒక ప్రశ్న అడిగారట. ఎన్టీఆర్ పాత్రలో తారక్, నా పాత్రలో చైతన్యు నటిస్తున్నారు.. మంచిదే. హీరోయిన్లని ఎవరో ఒకరిని పెడతారు.. అది కూడా ఒకే. కానీ సూర్యకాంతం పోషించిన గుండమ్మ పాత్రలో ఎవరిని పెడుతున్నారు అని ప్రశ్నించారట. ఏఎన్నార్ ప్రశ్నకి ఎవరి దగ్గరా సమాధానం లేదు అని మురళి మోహన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 

gundamma katha

గుండమ్మ కథ చిత్రంలో చాలా భాగం కథ ఆమెపైనే ఉంటుంది. ఎన్టీఆర్, చైతన్య నటనని ఎవరూ విమర్శించరు. కానీ గుండమ్మ పాత్రలో ఎవరో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని తీసుకువచ్చి పెట్టి.. ఆమె సరిగ్గా నటించకపోతే తప్పనిసరిగా సూర్యకాంతంతో పోల్చి తిడుతారు అని అందరికీ అర్థం అయింది. అందుకే గుండమ్మ కథ రీమేక్ ఆగిపోయింది అని మురళి మోహన్ తెలిపారు. 

gundamma

క్లాసిక్ చిత్రాలని రీమేక్ చేయాలనే డిమాండ్ ఫ్యాన్స్ వైపు నుంచి కూడా వస్తూ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్.. భవిష్యత్తులో దాన వీర శూర కర్ణ చిత్రాన్ని రీమేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

Latest Videos

vuukle one pixel image
click me!