ఒక్క ట్వీట్ లో  చైతూతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన సమంత... నాగార్జున మామ కాస్త... జస్ట్ నాగార్జున అయ్యారు!

First Published Sep 20, 2021, 6:25 PM IST

అక్కినేని ఫ్యామిలీలో ఏం జరుగుతుంది అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్నగా మారింది. నెల రోజులుగా సమంత, నాగ చైతన్య వివాహ బంధంపై అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . 


మీడియా కథనాలపై అటు నాగ చైతన్య కానీ, ఇటు సమంత కానీ స్పందించడం లేదు. వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారనేది స్పష్టం అవుతుండగా, కారణం ఏమిటో పూర్తిగా తెలియడం లేదు. 

మీడియాతో ఇంత రచ్చ జరుగుతున్నా... స్టేట్మెంట్స్ తో చెక్ పెట్టే ప్రయత్నం చేయడం లేదు. అదే సమయంలో సమంత సోషల్ మీడియా పోస్ట్స్ అనేక అనుమానాలను రేకెత్తించేవిగా ఉంటున్నాయి. 

నేడు ఏఎన్ఆర్ బర్త్ యానివర్సరీ కాగా, నాగార్జున తండ్రిని గుర్తుచేసుకుంటూ... ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై స్పందించిన సమంత, నాగార్జున పేరుకు ముందు వెనుక, ఎటువంటి గౌరవ సూచికలు లేకుండా పోస్ట్ చేశారు. 

కారణం ఏమిటో కానీ, వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేసి, నాగార్జున మామ అంటూ మరో ట్వీట్ చేశారు. మొదటి ట్వీట్ లో మామ అనే పదం లేకుండా సమంత ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సమంత, అక్కినేని కుటుంబం మధ్య నెలకొన్న వివాదాలను స్పష్టం చేసేదిగా ఉంది. 


తాజాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సమంతను, ఓ రిపోర్టర్ రూమర్స్ పై స్పందించాలని కోరారు. దీనికి ఆమె అగ్గిమీద గుగ్గిళం అయ్యారు. గుడికి వస్తే ఇలాంటి ప్రశ్నలా... బుద్ది ఉందా అంటూ ఫైర్ అయ్యారు.


సమంతకు ఈ విషయం గురించి మాట్లాడడం ఇష్టం లేకపోతే మౌనంగా ఉంటే సరిపోతుంది. అలా కాకుండా బుద్ది ఉందా అంటూ, రిపోర్టర్ పై మండిపడడం హాట్ టాపిల్ అయ్యింది.

click me!