Akhil Akkineni: చెత్త సినిమా చేశాం, పోతుందని ముందే తెలుసు.. ఏజెంట్ డిజాస్టర్ పై అఖిల్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌

Published : Jul 04, 2026, 02:50 PM IST

అఖిల్‌ అక్కినేని చివరగా `ఏజెంట్‌` చిత్రంలో నటించాడు. ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా ఫెయిల్యూర్‌పై తాజాగా రియాక్ట్ అయ్యాడు అఖిల్‌. అదొక చెత్త సినిమా అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. 

PREV
14
లెనిన్ మూవీతో వస్తోన్న అఖిల్‌

అఖిల్ అక్కినేని హీరోగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాల్లో ఏదీ హిట్‌ లేదు. చాలా వరకు పరాజయం చెందినవే, కొన్ని యావరేజ్‌గా ఆడాయి. కానీ అఖిల్‌కి మాత్రం బ్రేక్‌ ఇవ్వలేకపోయాయి. దీంతో తనని తాను నిరూపించుకునేందుకు పోరాడుతూనే ఉన్నాడు అఖిల్‌. అందులో భాగంగా ఇప్పుడు `లెనిన్‌` అనే సినిమాతో వస్తున్నారు. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. జులై 10న సినిమా రిలీజ్‌ కానుంది.

24
ఏజెంట్‌ ఫెయిల్యూర్‌పై అఖిల్‌ రియాక్షన్‌

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అఖిల్‌ తన ఫెయిల్యూర్స్ గురించి ఓపెన్‌ అయ్యాడు. సినిమా హిట్‌ కొట్టాలనే ప్రెజర్‌ ఉంటుందని, కానీ అది పాజిటివ్ వేలో ఉంటుందని తెలిపారు. తన గత చిత్రాలు ఆడలేదని తాను ఒప్పుకున్నాడు. ఈ విషయంలో ఎవరినీ ఛీట్‌ చేయడానికి లేదని, అది అందరికి తెలిసిందే అని చెప్పాడు అఖిల్‌. ఈ క్రమంలో గత చిత్రం `ఏజెంట్‌` గురించి ఆయన రియాక్ట్ అయ్యాడు. `ఏజెంట్‌కి అంత నెగటివిటీ రాకూడదని అనిపించిందా` అనే జర్నలిస్ట్ ప్రశ్నకి అఖిల్‌ రియాక్ట్ అయ్యాడు.

34
చెత్త సినిమా చేశాం, పోతుందని ముందే తెలుసు

`మేం బ్యాడ్‌ ఫిల్మ్ తీశాం. సింపుల్‌గా చెప్పాలంటే అదే జరిగింది. థియేటర్‌కి వెళ్లిన ఆడియెన్స్ కి సినిమా నచ్చలేదు. డిజప్పాయింట్‌ చేసింది. ఈ మూవీ విషయంలో నేను ఎవరినీ బ్లేమ్‌ చేయాలనుకోవడం లేదు. ఎందుకంటే అందులో నా పాత్ర కూడా ఉంటుంది, హిట్‌, ఫెయిల్యూర్‌ రెండింటినీ తీసుకోవాల్సిందే. సినిమాని రిలీజ్‌ రోజే థియేటర్లో చూశాను, నేనే డిజప్పాయింట్ అయ్యాను, అప్పుడే సినిమా పోతుందని అర్థమైంది` అని తెలిపారు అఖిల్‌.

44
లెనిన్‌తో కొట్టబోతున్నామని చెప్పిన అఖిల్‌

ఆ ఫెయిల్యూర్‌ని పాజిటివ్‌గా తీసుకొని, దాన్ని ఎనర్జీగా మార్చుకొని ఈ మూవీ(లెనిన్)ని చేసినట్టు తెలిపాడు. దీనిపై తనకు నమ్మకం ఉందని, సినిమా బాగా ఆడుతుందని నమ్ముతున్నట్టు తెలిపారు. కచ్చితంగా ఈ సారి కొడుతున్నామనే నమ్మకాన్ని అఖిల్‌ వెల్లడించారు. నాగార్జున కూడా సినిమా చూశాడని, ఆయనకు నచ్చిందని, అందుకే ట్వీట్ పెట్టాడని చెప్పాడు. నాన్న కూడా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు చెప్పాడు. నాగవంశీ, నాగార్జున కలిసి నిర్మించిన `లెనిన్‌` మూవీ జులై 10న విడుదల కాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories