సమంత నటించిన తొలి పాన్ ఇండియా చిత్రమిది. హరి హరీష్ దర్శకత్వం వహించారు. శ్రీదేవి మూవీస్ పతాకాలపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్నిముకుందన్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో నవంబర్ 11న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకి తెలుగు, తమిళంలో సమంతనే డబ్బింగ్ చెప్పడం విశేషం.