డైవర్స్ తర్వాత సమంత ఫస్ట్ ఇంటర్వ్యూ..అసలు విషయాలను దాస్తూ.. సోషల్‌ మీడియాపై వ్యాఖ్యలు

Published : Oct 21, 2021, 11:00 AM IST

సమంత సంచలన నిర్ణయం తీసుకుంది. నాగచైతన్యతో విడాకులు ప్రకటించి అందరికి షాకిచ్చింది. ఆ తర్వాత ఆచితూచి స్పందిస్తుంది సమంత. తాజాగా ఫస్ట్ టైమ్‌ ఆమె ఓ ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకుంది. కానీ అసలు విషయాలను హైడ్‌ చేసింది సమంత.   

PREV
110
డైవర్స్ తర్వాత సమంత ఫస్ట్ ఇంటర్వ్యూ..అసలు విషయాలను దాస్తూ.. సోషల్‌ మీడియాపై వ్యాఖ్యలు

సమంత, నాగచైతన్య విడాకుల ప్రకటన అనంతరం మానసిక ఒత్తిడికి గురైనట్టు వెల్లడించింది. తనపై వస్తోన్న రూమర్స్ కి ఘాటుగానే స్పందించింది. మరోవైపు ఒత్తిడి నుంచి బయటపడేందుకు, తన జీవితంలోని పెద్ద షాకింగ్‌ విషయం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంది సమంత. ఇటీవల ఎన్టీఆర్‌ హోస్ట్ గా రన్‌ అవుతున్న `ఎవరుమీలో కోటీశ్వరులు` షోలో పాల్గొంది. 25లక్షలు గెలుచుకుంది. సేవా కార్యక్రమాల కోసం ఈ అమౌంట్‌ని వాడబోతున్నట్టు వెల్లడించింది. 
 

210

ఇక ఫస్ట్ టైమ్‌ ఓ మీడియాతో ముచ్చటించింది సమంత. ఫిల్మ్ ఫేర్‌తో ఆమె ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకుంది. `ది ఫ్యామిలీ మ్యాన్‌2` వెబ్‌ సిరీస్‌, `శాకుంతలం` సినిమా, నెక్ట్స్ చేయబోతున్న సినిమాలు, సోషల్‌ మీడియా ప్రభావం, అల్లు అర్జున్‌ ముద్దుల తనయ అల్లు అర్హ, ఇలా అనేక విషయాలను ఆమె పంచుకుంది. కానీ అసలు విషయంపై ఎలాంటి కామెంట్‌ చేయలేదు. దాన్ని దాస్తూ వచ్చింది. మరి ఇంతకి సమంత ఏం చెప్పిందంటే?

310

`ది ఫ్యామిలీ మ్యాన్‌2` వెబ్‌ సిరీస్‌ చేస్తున్నప్పుడు చాలా ప్రత్యేకంగా అనిపించిందని, కానీ అది ఇంత పెద్ద సంచలనంగా మారుతుందని ఊహించలేదట. విడుదలకు ముందు అడ్డంకులు, వివాదాలు వెంటాడినా, ఫైనల్‌గా ఇంత పెద్ద హిట్‌ అవడం చాలా సంతోషంగా ఉందని చెప్పింది సమంత. ఇందులోని రాజీపాత్ర తనకు పాన్ ఇండియా ఇమేజ్‌ని తీసుకొచ్చిందని, ఉత్తరాది నుంచి కూడా ప్రశంసలు దక్కడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పింది. మరింత కష్టపడాలనే స్ఫూర్తిని రగిలించిందని చెప్పింది సమంత. 

410

అయితే గతకొంత కాలంగా తాను రొటీన్‌ సినిమాలు చేస్తున్నాననే ఫీలింగ్‌ కలిగిందని,అందుకే ప్రయోగాత్మక చిత్రాలు, ఎక్స్ పర్‌మెంటల్‌ రోల్స్ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది సమంత. `శాకుంతలం` సినిమా గురించి చెబుతూ,  `సినిమా చేస్తున్నప్పుడు అస్సలు ఒత్తిడికి గురికాలేదు. ఎందుకంటే నాకు మొదటి నుండి ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. రాజీ పాత్రని ఏదైతే ఊహించి చేశానో.. శాకుంతలం పాత్ర కూడా అంతే. అయితే ఇందులో రాజీ పాత్రకి పూర్తి వ్యతిరేక పాత్రలో కనిపిస్తాను. ఇందులో ప్రతి షాట్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా ఉంటుంది. నేను ఎప్పుడూ చూడనంత అందంగా కనిపిస్తాను` అని చెప్పింది. 

510

`నాకు పురాణ కథలు అంటే చాలా ఇష్టం. వాటిని ఎప్పుడూ చదువుతూ.. మహారాణిలా ఊహించుకుంటాను. `శాకుంతలం`తో నా డ్రీమ్ రోల్ చేసే అవకాశం వచ్చింది. నేను డిస్నీకి అభిమానిని. `శాకుంతలం`లోని పాత్ర నేను కోరుకున్నది. కొన్ని షాట్లలో, నిజంగా నన్ను నేనే నమ్మలేకపోయాను. అంతగొప్పగా ప్రొడక్షన్ డిజైన్, కాస్ట్యూమ్స్, లైటింగ్, మేకప్ టీమ్ పని చేసింది. ఈ స్ర్కిఫ్ట్ నాకు చెబుతున్నప్పుడే నీతా లుల్లా దుస్తుల గురించి మాట్లాడటం గ్రహించాను. నాకోసం అందమైన దుస్తులు డిజైన్ చేశారు. నీతా లుల్లా గతంలో ఎన్నో ఐకానిక్ పాత్రలను డిజైన్ చేసింది. శాకుంతలంలో ఎన్నడూ చూడని లుక్స్ చూస్తారు` అని చెప్పారు. 

610

ఇప్పటి వరకు సౌత్‌ సినిమాల్లోనే మెరిసిన ఆమె ఇకపై బాలీవుడ్‌ చిత్రాల్లోనూ నటిస్తానని చెప్పింది. `ది ఫ్యామిలీ మ్యాన్ 2` సిరీస్‌లో నా పాత్రని అందరూ ఆదరించారు. ఆ సిరీస్ నాలో ఆత్మవిశ్వాసం నింపడమే కాకుండా బాలీవుడ్‌లో వర్క్ గురించి అవగాహన కల్పించింది. భాష ఏదైనా మరిన్ని సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. బాలీవుడ్ అవకాశాలు వస్తే తప్పకుండా చేస్తానని తెలిపింది.

710

అల్లు అర్జున్‌ తనయ అల్లు అర్హ గురించి చెబుతూ, ఆమె పుట్టడమే రాక్ స్టార్. ఆ పాప గురించి నేను ఏం చెప్పినా తక్కువే అవుతుంది. సెట్‌లో 200 నుండి 300 మంది ఉన్నప్పటికీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. మొదటి ప్రయాణంలోనే చాలా మంచి నిర్ణయం తీసుకుంది. అంతేకాదు అర్హ అద్భుతంగా తెలుగు మాట్లాడుతుంది. పుట్టుకతోనే సూపర్‌స్టార్‌గా జన్మించిన ఆమె నా సినిమాతో అరంగేట్రం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆమె ఈ పరిశ్రమను ఏలబోతోంది. సినిమా చూసిన తర్వాత అందరూ నా మాటతో ఏకీభవిస్తారని తెలిపింది సమంత.

810

సోషల్‌ మీడియా గురించి చెబుతూ దాన్ని అదుపులో ఉంచాలని పేర్కొంది. `సోషల్ మీడియా ద్వారా గొప్ప ప్లస్‌లు, కొన్ని మైనస్‌లు ఉన్నాయి. మనం డిజిటల్ యుగంలో ఉన్నామని మరిచిపోకూడదు. అలవాటు ఏదైనా కావచ్చు.. అది మితంగా, నియంత్రణలో ఉండాలి. అందుకే ట్రోల్స్‌పై స్పందించను. ఒకవేళ నేను మాట్లాడాల్సిన అవసరం వస్తే మాత్రం.. అది నా మౌనం కంటే ఉత్తమమైనదై ఉండాలని తెలిపింది సామ్‌. ఇక ఇంటర్వ్యూల్లో తాను హెడ్‌లైన్‌ కోసం అడిగే ప్రశ్నలను ధ్వేషిస్తానని తెలిపింది. అవి అత్యంత అమానవీయమైనవిగా భావిస్తుందట. 

910

ఇంత చెప్పిన సమంత అసలు విషయం దాచింది. నాగచైతన్య గురించి ఒక్క విషయం కూడా చెప్పలేదు. తమ విడాకులు, దానికి దారి తీసిన అంశాలను మాత్రం హైడ్‌ చేసింది. అందరు వీరు డైవర్స్ తీసుకోవడానికి కారణాలేంటనేది తెలియక సతమతమవుతుంటే, సమంత మాత్రం ఆ విషయాలు చర్చించేందుకు నిరాకరించడం గమనార్హం. మరి దీనిపై వీరు ఎప్పుడు మౌనం వీడుతారు, తమ మధ్య నెలకొన్న వివాదానికి కారణమేంటనేది ఎప్పుడు రివీల్‌ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. 
 

1010

సమంత, నాగచైతన్య 2017, అక్టోబర్‌ 6,7 తేదీలో ఇరు సాంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత ఇటీవల అక్టోబర్‌ 2న విడిపోతున్నట్టు ఇద్దరూ ప్రకటించి షాక్‌కి గురిచేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సమంత ఇప్పుడు పూర్తి స్థాయిలో కెరీర్‌పై ఫోకస్‌ పెడుతుంది. ఇటీవల విజయదశమి సందర్భంగా రెండు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించింది. 

also read: మూడు ఛానళ్లపై పరువు నష్టం దావా.. సమంతకు కోపానికి కారణం అదే, కుప్పలు తెప్పలుగా రూమర్లు!

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories