భోగి మంటల్లో అవన్నీ తగలబెట్టేశా, ఒంటరిగా సమంత సంక్రాంతి సంబరాలు.. వైరల్ ఫొటోస్..

Published : Jan 15, 2024, 08:57 PM ISTUpdated : Jan 15, 2024, 08:58 PM IST

సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం సమంత తన హెల్త్ ని మెరుగుపరుచుకుంటూ యోగ వర్కౌట్స్ చేస్తోంది.

PREV
17
భోగి మంటల్లో అవన్నీ తగలబెట్టేశా, ఒంటరిగా సమంత సంక్రాంతి సంబరాలు.. వైరల్ ఫొటోస్..

సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న స్టార్ బ్యూటీ సమంత సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ప్రస్తుతం సమంత తన హెల్త్ ని మెరుగుపరుచుకుంటూ యోగ వర్కౌట్స్ చేస్తోంది. సమంత తదుపరి చిత్రం ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. చివరగా సామ్ ఖుషి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. 

27

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత అనేక ఒడిడుకులు ఎదుర్కొంది. అనేక అవమానాలు ఎదుర్కొంటూనే కెరీర్ లో ముందుకు సాగింది. అనంతరం మయోసైటిస్ వ్యాధికి గురై ఆరోగ్యంతో పోరాడింది. ప్రస్తుతం కాస్త కోలుకున్న సమంత పూర్తి ఫిట్ నెస్ సాధించేందుకు ప్రయత్నిస్తోంది. మయోసైటిస్ వ్యాధి తగ్గిపోయింది. 

37

అయితే దాని ప్రభావం, మెడిసిన్స్ కారణంగా సమంత ఫిట్ నెస్ కోల్పోయింది. మునుపటిలా సామ్ ఫిట్ గా మారేందుకు తెగ కష్టపడాల్సి వస్తోంది. కొంత ట్రీట్ మెంట్ కూడా అవసరం అవుతోంది. అందుకే సమంత సినిమాల నుంచి ఏడాది విరామం తీసుకుంది. 

47

సమంత తరచుగా సోషల్ మీడియాలో తన యాక్టివిటీస్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. యోగా చేసినా జిమ్ చేసినా ఆ దృశ్యాల్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

57

తాజాగా సమంత తన సంక్రాంతి సెలెబ్రేషన్స్ ని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఒంటరిగా సంక్రాంతిని జరుపుకుంటున్న దృశ్యాలు పోస్ట్ చేస్తూ వివరిస్తూ అనేక విషయాలు పంచుకుంది. సమంత పోస్ట్ చేస్తూ.. ఈ సంక్రాంతికి ఎంతో హ్యాపీగా గడుపుతున్నట్లు పేర్కొంది. 

67

గాలిపటం ఎగురవేసింది. అది తెగిపోయిందట. అలాగే పాత వస్తువులని, బ్యాడ్ గా ఉన్న వస్తువులని భోగి మంటల్లో వేసి తగలబెట్టేసిందట. పాత పద్దతిలో తలంటు స్నానం చేసిందట. చిన్న ముగ్గు వేసి ఇంటిని అందమైన పూలతో అలంకరించింది. ఆ తర్వాత ఇంట్లో అసలైన యుద్ధం మొదలైనట్లు తెలిపింది.

77

 అది కూడా తన పెట్స్ అయిన పిల్లి కుక్క మధ్య ఇల్లు ఎవరిది అనే విషయంలో గొడవ జరిగిందట. కానీ చివరకి పిల్లే గెలిచినట్లు సమంత సరదాగా పేర్కొంది. ఫ్యాన్స్ అంతా సమంతకి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories