అకిరా లేటెస్ట్ లుక్ పై రేణు దేశాయ్ పోస్ట్..చివరికి వాళ్ళ నాన్న పాట రియల్ లైఫ్ లో అంటూ కామెంట్స్

Published : Jan 15, 2024, 07:22 PM IST

పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సింగిల్ గానే ఉంటూ తన పిల్లల భాద్యతలు చూసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రేణు దేశాయ్ తన పిల్లల గురించి అనేక విశేషాలు పంచుకోవడం చూస్తూనే ఉన్నాం.

PREV
16
అకిరా లేటెస్ట్ లుక్ పై రేణు దేశాయ్ పోస్ట్..చివరికి వాళ్ళ నాన్న పాట రియల్ లైఫ్ లో అంటూ కామెంట్స్

పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ సింగిల్ గానే ఉంటూ తన పిల్లల భాద్యతలు చూసుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రేణు దేశాయ్ తన పిల్లల గురించి అనేక విశేషాలు పంచుకోవడం చూస్తూనే ఉన్నాం. అకిరా నందన్, ఆద్య నెమ్మదిగా పెద్దవాళ్లు అవుతుండడంతో సోషల్ మీడియాలో వారిపై ఫోకస్ పెరుగుతోంది. 

26

రేణు దేశాయ్ తరచుగా సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెట్టడం చూస్తూనే ఉన్నాం. ఇటీవల రేణు దేశాయ్ ఎక్కువగా తన పిల్లలని మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉంచుతోంది. మెగాస్టార్ చిరంజీవి, రాంచరణ్,  అల్లు అర్జున్, అల్లు అరవింద్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్, వరుణ్ లావణ్య జంట ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్క చోట చేరి సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. 

36

అయితే ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ మిస్సయ్యారు. కానీ పవన్ తనయుడు అకిరా నందన్, కుమార్తె ఆద్య ఇద్దరూ మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అన్నయ్యలు, పెదనాన్నలు, బంధువులతో అకిరా ఆద్య కలసిపోయారు. ఎప్పుడూ తన ఫేస్ రివీల్ కాకుండా మాస్క్ తో కనిపించే అకిరా ఈ సారి మాత్రం దర్శనం ఇచ్చాడు. 

46

అకిరా లేటెస్ట్ లుక్ మెగా ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పవన్ కళ్యాణ్ యంగ్ ఏజ్ లో ఎలా ఉన్నారో అకిరా అచ్చు గుద్దినట్లు అలాగే ఉన్నాడు. దీనితో అభిమానులు అకిరా, పవన్ కళ్యాణ్ ఫోటోలు పక్క పక్కన పెట్టి మురిసిపోతున్నారు. అదే సమయంలో అకిరా, ఆద్య మధ్య అన్న చెల్లెళ్ళ అనుబంధం కూడా చూడ ముచ్చటగా ఉంది. 

56

ఈ ఫోటోలని రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఫోటోలకు బ్యాగ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ పాటని జోడించింది. అన్నవరం చిత్రంలోని అన్నయ్య అన్నావంటే అనే సాంగ్ ని రేణు దేశాయ్ పోస్ట్ చేశారు. 

66

చివరకి వాళ్ళ నాన్న పాట రియల్ లైఫ్ లో ఇలా కనిపిస్తోంది అంటూ అకిరా, ఆద్య బంధం గురించి కామెంట్స్ చేసింది. అలాగే అభిమానులకు రేణు దేశాయ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపింది. 

Read more Photos on
click me!

Recommended Stories