Samantha Record: అనుష్కనే కాదు, కీర్తిసురేష్‌ రికార్డు కూడా బ్రేక్‌.. ఇక సమంతనే నెంబర్‌ 1

Published : Jul 03, 2026, 10:35 PM IST

Samantha Record: సమంత రూత్ ప్రభు నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన లేడీ ఓరియెంటెడ్ తెలుగు సినిమాగా కొత్త రికార్డు సృష్టించింది. ఈ చిత్రం అధికారికంగా అనుష్క శెట్టి 'అరుంధతి' రికార్డును బ్రేక్ చేసింది.

PREV
18
మా ఇంటి బంగారంతో సమంత సరికొత్త రికార్డులు

సమంత మూడేళ్ల గ్యాప్‌తో `మా ఇంటి బంగారం` మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాజ్‌ నిడిమోరు వర్క్ చేశారు. నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ చిత్రం గత రెండు వారాల క్రితం విడుదలై విజయవంతంగా రన్‌ అవుతుంది. బాక్సాఫీసు వద్ద అదిరిపోయే వసూళ్లని రాబడుతోంది. సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. 

28
అరుంధతి రికార్డ్ బ్రేక్‌ చేసిన సమంత మా ఇంటి బంగారం

'మా ఇంటి బంగారం' సినిమా 12వ రోజుకు ప్రపంచవ్యాప్తంగా రూ.83.12 కోట్లు వసూలు చేసింది. 16 ఏళ్లుగా 'అరుంధతి' పేరిట ఉన్న రూ.70 కోట్ల రికార్డును ఇది అధిగమించింది. 10వ రోజుకే ఈ సినిమా రూ.78.71 కోట్లు దాటింది. అంతేకాదు అనుష్క పేరుతో ఉన్న మరో రికార్డుని కూడా ఇది బ్రేక్‌ చేసింది. 

38
మా ఇంటి బంగారం కలెక్షన్లు
10వ రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదనంగా రూ.1 కోటి వసూలు చేసింది. దీంతో మొత్తం గ్లోబల్ కలెక్షన్ రూ.22.85 కోట్లకు చేరిందని కూడా సమాచారం. 12వ రోజు నాటికి మాత్రం సినిమా గ్లోబల్ గ్రాస్ రూ.83.12 కోట్లకు పెరిగింది. ఇండియాలో నెట్ కలెక్షన్ రూ.50 కోట్లు దాటింది.
48
అరుంధతి రికార్డు బ్రేక్‌

'మా ఇంటి బంగారం' సినిమా, 2009లో వచ్చిన కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన హారర్ ఫాంటసీ 'అరుంధతి' రికార్డును అధికారికంగా బ్రేక్ చేసింది. అనుష్క శెట్టి నటించిన ఆ సినిమా తన లైఫ్‌టైమ్‌లో ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్లు వసూలు చేసింది. 

58
రుద్రమదేవి మూవీ రికార్డు కూడా బ్రేక్‌

దీంతోపాటు అనుష్క నటించిన మరో మూవీ రికార్డుని బ్రేక్‌ చేసింది. అదే `రుద్రమదేవి`. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రానా, అల్లు అర్జున్‌ కూడా నటించారు. ఈ మూవీ యావరేజ్‌గా ఆడింది. కానీ రూ.81కోట్లు రాబట్టింది. దీన్ని సమంత `మా ఇంటి బంగారం` దాటేసింది. 

68
అడ్డంకులను ఎదుర్కొని సూపర్‌ హిట్‌

సమంత నటించి, నిర్మించిన తెలుగు సినిమా 'మా ఇంటి బంగారం', ఇతర సినిమాల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ అతిపెద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచింది. సమంత సాధించిన ఈ విజయం, భవిష్యత్తులో మహిళా ప్రధాన చిత్రాల కథ, నిర్మాణం, పెట్టుబడుల విషయంలో పెద్ద ఊపునిస్తుంది. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కల్కి వంటి బ్లాక్‌బస్టర్‌ల తర్వాత కూడా, గత 16 ఏళ్లలో ఏ లేడీ ఓరియెంటెడ్ తెలుగు సినిమా ఈ రికార్డును అందుకోలేకపోయింది. ఇప్పుడు అది సాధ్యమైంది.

78
మహానటి రికార్డు కూడా బ్రేక్‌

ఇదిలా ఉంటే `మా ఇంటి బంగారం` మూవీ మరో రికార్డుని క్రియేట్‌ చేస్తుంది. ఇది లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా `మహానటి` ఉంది. కీర్తిసురేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మహానటి సావిత్రి జీవితం ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం రూ.83కోట్లు రాబట్టింది. తెలుగులో వచ్చిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ రికార్డ్ ని కూడా సమంత సినిమా బ్రేక్‌ చేయడం విశేషం. 

88
మా ఇంటి బంగారానికి లాభాల పంట

రూ.30 కోట్ల బడ్జెట్‌తో 'మా ఇంటి బంగారం' సినిమాను బి.వి. నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. సమంత సొంత నిర్మాణ సంస్థ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు ఈ సినిమాను నిర్మించారు. జూన్ 19, 2026న విడుదల కావడానికి ముందే, ఈ సినిమా ఓటీటీ రైట్స్ ద్వారా బడ్జెట్‌లో గణనీయమైన మొత్తాన్ని రికవరీ చేసింది. ఇప్పుడు ఓవరాల్ గా ఈ సినిమా సుమారు యాభైకోట్ల ప్రాఫిట్‌ పొందుతున్న సినిమాగా నిలిచింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories