ఈ నేపథ్యంలో ప్రీతమ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సమంతను తాను అక్కగా భావిస్తానని, తమ మధ్య ఉన్న రిలేషన్ ఏమిటో నాగ చైతన్యకు కూడా తెలుసని మీడియా ద్వారా వెల్లడించారు. అయినా సమంత, అక్కినేని అభిమానులు ప్రీతమ్ ని టార్గెట్ చేయడం మానలేదు. నిప్పులేకుండా పొగరాదంటూ, నెగిటివ్ కామెంట్స్ చేశారు.