దేశవ్యాప్తంగా వాలెంటైన్స్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ రోజున తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. అయితే, కొందరు ఫిల్మ్ సెలబ్రిటీలకు పెళ్లి తర్వాత ఇదే మొదటి వాలెంటైన్స్ డే. ఆ జంటలు ఎవరు?
సమంత రూత్ ప్రభు, డైరెక్టర్ రాజ్ నిడిమోరును డిసెంబర్ 1, 2025న పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ జంట తమ మొదటి వాలెంటైన్స్ డే జరుపుకుంటోంది. ఇద్దరు గతంలో ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నవారే. ఇద్దరికి ఇది రెండో పెళ్లి.
26
నూపుర్ సనన్-స్టెబిన్ బెన్
నూపుర్ సనన్, స్టెబిన్ బెన్ ఈ ఏడాది జనవరిలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లయిన 35 రోజులకే వీళ్లిద్దరూ తమ తొలి వాలెంటైన్స్ డే జరుపుకుంటున్నారు. అందుకోసం వారు గట్టిగానే ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
36
ప్రతీక్ బబ్బర్-ప్రియా బెనర్జీ
ప్రతీక్ బబ్బర్ తన గర్ల్‌ఫ్రెండ్ ప్రియా బెనర్జీని ఫిబ్రవరి 14, 2025న పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది వాలెంటైన్స్ డే రోజే వాళ్ల మొదటి పెళ్లి రోజు కావడం విశేషం. మొదటి పెళ్లి రోజును వారు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారట.
కంటెంట్ క్రియేటర్, నటి ప్రాజక్తా కోలి, లాయర్ వృశాంక్ ఖనాల్‌ను ఫిబ్రవరి 25, 2025న పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ జంటకు ఇదే మొదటి వాలెంటైన్స్ డే. త్వరంలో వీరు కూడా మొదటి పెళ్లి రోజును జరుపుకోబోతున్నారు.
56
ఆదార్ జైన్-అలేఖా అద్వానీ
ఆదార్ జైన్, అలేఖా అద్వానీ ఫిబ్రవరి 2025లో ముంబైలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఈ ఏడాది తమ తొలి వాలెంటైన్స్ డే జరుపుకుంటోంది.
66
లారెన్ గాట్లిబ్-టోబియాస్ జోన్స్
లారెన్ గాట్లిబ్ కూడా పెళ్లి తర్వాత తన మొదటి వాలెంటైన్స్ డే జరుపుకుంటోంది. ఈమె వీడియో ప్రొడ్యూసర్, డైరెక్టర్ టోబియాస్ జోన్స్‌ను జూన్ 11, 2025న పెళ్లి చేసుకుంది.