స్టైలిష్ వేర్ లో శ్రద్ధా దాస్ స్టన్నింగ్ స్టిల్స్.. ‘ఢీ’భామ క్యూట్ స్మైల్ కు గుండెలు గల్లంతే..

First Published | Apr 30, 2023, 4:57 PM IST

హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) ప్రస్తుతం వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది.  తాజాగా స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చింది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చి ఆకట్టుకుంటోంది. 
 

గ్లామరస్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. వెండితెరపై పెద్దగా అవకాశాలను లేకపోయినా బుల్లితెరపై మాత్రం సందడి చేస్తోంది.  తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. గ్లామర్ మెరుపులతో అట్రాక్ట్ చేస్తోంది.
 

‘సిద్దూ ఫ్రం శ్రీకాకుళం’ చిత్రంతో హీరోయిన్ గా ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.  తొలిచిత్రంతోనే తన  అందం, నటనతో కట్టిపడేసింది.  ఆ తర్వాత వరుస తెలుగులో ఆఫర్లు దక్కించుకుంది. కానీ పెద్ద హిట్స్ అందుకోలేకపోయింది.
 


కానీ ‘ఆర్య2’, ‘డార్లింగ్’ వంటి చిత్రాలతో మాత్రం సెకండ్ హీరోయిన్ గా ప్రేక్షకుల్లో తనదైన ముద్ర వేసుకుంది. వెండితెరపై గ్లామర్ రోల్స్ లో అదరగొట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి  సినిమాల్లో అవకాశాలు లేవనే చెప్పాలి.  కానీ బుల్లితెరపై, వెబ్ సిరీస్ ల్లో సందడి చేస్తోంది.

మరోవైపు సోషల్ మీడియాలోనూ శ్రద్ధా దాస్ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ వస్తోంది.  తన గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంది.  తాజాగా తన శ్రీ లంక వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. స్టైలిష్ సూట్ లో గ్లామర్ బ్యూటీ స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. 
 

గ్లామర్ మెరుపులతో రచ్చ చేసే శ్రద్ధా నిండు దుస్తుల్లో దర్శనమిచ్చి ఆకట్టుకుంది. అయినా క్రేజీ ఫోజులతో ఆకట్టుకుంది. మరోవైపు క్లీవేజ్ షోతోనూ మతులు పోగొట్టింది.  క్యూట్ స్మైల్ తో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. దీంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఆమె ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 

ప్రస్తుతం శ్రద్ధా దాస్ బుల్లితెరపై ‘ఢీ15’కు జడ్జీగా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటోంది. గ్లామర్ వొలకబోస్తూ ఆకట్టుకుంటోంది.  మరోవైపు తన ఫ్యాషన్ సెన్స్ తోనూ కట్టిపడేస్తోంది. సినిమాల విషయానికొస్తే గతంలోనే ప్రారంభమైన ‘నీరిక్షణ’, ‘అర్థం’ చిత్రాలు విడుదల  కావాల్సి ఉన్నాయి. 

Latest Videos

click me!