బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్‌తో `సలార్‌` ట్రైలర్‌.. వచ్చేది అప్పుడే.. `జవాన్‌`తో థియేటర్లో రచ్చ ?

Published : Aug 30, 2023, 04:50 PM ISTUpdated : Aug 30, 2023, 06:27 PM IST

ఇప్పుడు  `సలార్‌` ట్రైలర్‌ రిలీజ్‌కి టైమ్‌ ఫిక్స్ చేసిందట హోంబలే ఫిల్మ్స్. సెప్టెంబర్‌ 6న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. బెంగుళూరులో పెద్ద ఈవెంట్‌ నిర్వహించి ట్రైలర్‌ని నిర్వహిస్తారని సమాచారం. 

PREV
15
బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్‌తో `సలార్‌` ట్రైలర్‌.. వచ్చేది అప్పుడే.. `జవాన్‌`తో థియేటర్లో రచ్చ ?

ప్రభాస్‌ ఈ ఏడాది `ఆదిపురుష్‌`తో వచ్చాడు. ఇప్పుడు మరో భారీ సినిమాతో రాబోతున్నాడు. `సలార్‌` మూవీ సెప్టెంబర్‌లో విడుదల కాబోతుంది. ఈ సినిమాపైనే అందరి ఆశలు, అంచనాలున్నాయి. దీనితో గట్టిగా కొట్టాలని భావిస్తున్నారు. బాక్సాఫీసు డైనోసార్‌ రాబోతుందంటూ ఫ్యాన్స్ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ప్రభాస్‌ `సలార్‌`ని డైనోసార్‌గా వర్ణిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఆగస్ట్ లో బిగ్గెస్ట్ అప్‌డేట్‌ ఉంటుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ లేదు. అయితే ట్రైలర్‌ని రిలీజ్‌ చేస్తారని భావించినా, నిరాశే మిగిలింది. 

25

ఈ నేపథ్యంలో ఇప్పుడు  `సలార్‌` ట్రైలర్‌ రిలీజ్‌కి టైమ్‌ ఫిక్స్ చేసిందట హోంబలే ఫిల్మ్స్. సెప్టెంబర్‌ 6న గ్రాండ్‌గా రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు. బెంగుళూరులో పెద్ద ఈవెంట్‌ నిర్వహించి ట్రైలర్‌ని నిర్వహిస్తారని సమాచారం. ఈ మేరకు ఇందులో యష్‌ కూడా పాల్గొంటారని తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ట్రైలర్‌కి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్‌, గూస్‌బంమ్స్ తెప్పించే వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. `ట్రైలర్‌`లో యష్‌ కూడా మెరవబోతున్నారని తెలుస్తుంది. 

35

అంతేకాదు `సలార్‌ః సీజ్‌ఫైర్‌` పార్ట్ వన్‌లో యష్‌ కనిపిస్తారట. సినిమా చివర్లో గెస్ట్ అప్పీయరెన్స్ లాగా ఓ ఐదు నిమిషాలపాటు యష్‌ మెరవబోతున్నారని సమాచారం. సెకండ్‌ పార్ట్ పై హైప్‌ పెంచేలా ఆయన పాత్ర ఉంటుందట. అంతేకాదు సెకండ్‌ పార్ట్ లోనూ ఆయన పాత్ర ఉండబోతుందని లేటెస్ట్ సమాచారం. ఇది నిజమేనా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వార్త అటు యష్‌ అభిమానులు, ఇటు ప్రభాస్‌ ఫ్యాన్స్ కి కిక్కెంచేలా ఉంది. ఇదే నిజమైతే బాక్సాఫీసుకి పూనకాలు తెప్పించే విషయమనే చెప్పాలి. ఏది నిజం అనేది చూడాలి. 

45

ఇదిలా ఉంటే `సలార్‌` ట్రైలర్‌కి సంబంధించిన మరో విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ ట్రైలర్‌ని `జవాన్‌` సినిమాతో ప్రదర్శించబోతున్నారట. సెప్టెంబర్‌ 6న రిలీజ్‌ చేసి, ఏడున థియేటర్లలో `జవాన్‌` మధ్యలో ప్రదర్శిస్తారని సమాచారం. ఆ సినిమాతోపాటు `సలార్‌`కి హైప్‌ పెంచేలా ఇది ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. వాస్తవం ఏంటనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. 
 

55

`కేజీఎఫ్‌` వంటి సంచలనాత్మక చిత్రాల తర్వాత దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌.. ప్రభాస్‌ వంటి గ్లోబల్‌ స్టార్‌తో `సలార్‌` చేయడం విశేషం. ఈ కాంబినేషనే అదిరిపోయేలా ఉంది. ఇందులో మలయాళ స్టార్‌ పృథ్వీ రాజ్‌ సుకుమారన్‌ విలన్‌ రోల్‌ చేస్తున్నారు. శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తుంది. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న `సలార్‌`రెండు భాగాలుగా రాబోతుంది.  పార్ట్ 1 `సీజ్‌ ఫైర్‌`గా రానుంది.  సెప్టెంబర్‌ 28న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories