ట్రెండీ వేర్ లో ప్రియా వారియర్ స్టన్నింగ్ స్టిల్స్.. నయా లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్న మలయాళీ భామ

First Published | Aug 30, 2023, 3:06 PM IST

మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా వారియర్ ‘బ్రో’ చిత్రంతో రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కీలక పాత్ర పోషించి ఆకట్టకుంది. మళ్లీ తెలుగులో అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. 
 

యంగ్ బ్యూటీ, మలయాళీ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్ (Priya Prakash Varrier)  కన్నుగీటు వీడియోతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ దక్కించుకుంది. ఫలితంగా మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ సినీ ఆఫర్లు అందుకుంటోంది. 
 

టాలీవుడ్ లోనూ ఈ బ్యూటీకి ఆఫర్లు అందాయి. ‘చెక్’, ‘ఇష్క్ : నాట్ ఏ లవ్ స్టోరీ’ చిత్రాల్లో కథానాయికగా మెరిసింది. తెలుగు ప్రేక్షకులను పలకరించింది. కానీ ఆ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో మరిన్ని ఆఫర్లు అందుకోలేకపోయింది. వచ్చిన ఆఫర్లను మాత్రం వినియోగించుకుంటోంది.


ఇక రీసెంట్ గా మాత్రం పవన్ కళ్యాణ్ నటించిన ‘బ్రో’ చిత్రంతో మళ్లీ తెలుగు తెరపై మెరిసింది. సాయిధరమ్ తేజ్ కు చెల్లెలిగా చక్కగా నటించింది. ఈ సినిమా విజయవంతం కావడంతో ఇక్కడ మరిన్ని అవకాశాలు అందుకునేలా ఉందని అంటున్నారు. 

ఈక్రమంలోనే ప్రియా వారియర్ సోషల్ మీడియలోనూ తెగ సందడి చేస్తోంది. వరుసగా పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ తో పాటు దర్శక, నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా అదిరిపోయే లుక్ లో మెరిసింది.

తాజాగా ప్రియా వారియర్ పంచుకున్న ఫొటోలు అట్రాక్టివ్ గా ఉన్నాయి. స్లీవ్ లెస్ టాప్, ట్రెండీ ట్రౌజర్ లో క్రేజీ లుక్ ను సొంతం చేసుకుంది. కూర్చిపై కిల్లింగ్ ఫోజులిస్తూ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లూ లైక్ చేస్తున్నారు. 

కెరీర్ విషయానికొస్తే.. ‘బ్రో’ చిత్రం తర్వాత  ఈ బ్యూటీ తెలుగులో వరుస చిత్రాల్లో మెరుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ప్రియా హిందీలో ‘3 మంకీస్’, ‘లవ్ హ్యాకర్స్’, ‘శ్రీదేవి బంగ్లా’, ‘యారియన్ 2’, కన్నడలో ‘విష్ణు ప్రియా’ వంటి సినిమాలు చేస్తోంది. 

Latest Videos

click me!