`సలార్‌` ట్రైలర్‌పై ఓ వైపు ట్రోలింగ్‌, మరోవైపు ట్రెడింగ్‌.. `డంకీ` ముందు నిలబడతాడా?.. ఫ్యాన్స్ లో ఆందోళన

Published : Dec 01, 2023, 09:51 PM ISTUpdated : Dec 01, 2023, 09:52 PM IST

ప్రభాస్‌ నటిస్తున్న `సలార్‌` మూవీ నుంచి ఎట్టకేలకు ట్రైలర్‌ విడుదలైంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ యూట్యూట్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది. కానీ దారుణంగా ట్రోల్‌ అవుతుంది.   

PREV
112
`సలార్‌` ట్రైలర్‌పై ఓ వైపు ట్రోలింగ్‌, మరోవైపు ట్రెడింగ్‌.. `డంకీ` ముందు నిలబడతాడా?..  ఫ్యాన్స్ లో ఆందోళన

`బాహుబలి` తర్వాత ప్రభాస్‌కి సరైన హిట్‌ పడలేదు. ప్రభాస్‌ రేంజ్‌ని చూపించే సినిమా పడలేదు. `సాహో` మిస్‌ ఫైర్‌ అయ్యింది. `రాధేశ్యామ్‌`, `ఆదిపురుష్‌` డిజప్పాయింట్‌ చేశాయి. దీంతో ఆ డిజప్పాయింట్‌కి, ఆ లోటని తీర్చే సినిమా `సలార్‌` అని ఫ్యాన్స్, సినీ అభిమానులు సైతం భావిస్తున్నారు. 
 

212

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న నేపథ్యంలో దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇందులో డార్లింగ్‌ ఓ నాయకుడి పాత్రలో కనిపించబోతుండటంతో సినిమా నెక్ట్స్ లెవల్‌ ఉంటుందని, `కేజీఎఫ్‌`ని మించి ఉంటుందని భావిస్తున్నారు. అదే అంచనాలతో, ఆశలతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మెప్పించింది. అందులో ప్రభాస్‌ని సరిగా చూపించకపోవడంతో కొంత నిరాశ చెందారు. 
 

312

ఆగస్ట్ లోనే ట్రైలర్‌ని విడుదల చేస్తామని ప్రకటించారు. సెప్టెంబర్‌లో సినిమాని రిలీజ్‌ చేస్తామన్నారు. కానీ వాయిదా వేశారు. డిసెంబర్‌ 22కి పోస్ట్ పోన్‌ చేశారు. సీజీ వర్క్ కారణంగా వాయిదా వేశారు. ఇక సినిమాకి నెల రోజులు కూడా లేదు. ఈ నేపథ్యంలో అప్‌డేట్ల కోసం ఫ్యాన్స్ చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నారు. 

412

ఈ  నేపథ్యంలో తాజాగా నేడు(డిసెంబర్‌ 1న) `సలార్‌` ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ వారి అంచనాలను రీచ్‌ కాలేదనే టాక్‌ వినిపిస్తుంది. 

512

ప్రశాంత్‌ నీల్‌, ప్రభాస్‌ కాంబినేషన్‌లో సినిమా అంటే భారీ ఎలివేషన్లు, విరోచితమైన యాక్షన్‌ ఎపిసోడ్లు, భారీ డైలాగులు ఉంటాయని భావించారు. కానీ ట్రైలర్‌ ఆ రేంజ్‌లో లేదు. సరైన ఎలివేషన్లు లేవు. ప్రభాస్‌ కటౌట్‌ అదిరిపోయింది. కటౌట్‌ని, ఆయన హీరోయిజాన్ని ప్రతిబింబించేలా ఎలిమెంట్లు ట్రైలర్‌లో సరిగా లేవని అంటున్నారు. 
 

612

ముఖ్యంగా ప్రభాస్‌ డైలాగ్‌ డెలివరీపై తీవ్ర అసంతృప్తి ఎదురవుతుంది. తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. ప్రభాస్‌ డైలాగ్‌లో ఏమాత్రం ఈజ్‌ లేదని, పవర్‌ ఫుల్‌ డైలాగ్‌లు లేవని, అలాంటి సీన్లు లేవని వారు ఆవేదన చెందుతున్నారు. వాహ్‌ అనిపించేలా ప్రభాస్‌ని చూపించలేకపోయారని అంటున్నారు. 

712

మరోవైపు బీజీఎం విషయంలోనూ అసంతృప్తిఉంది. సినిమాలో చాలా వరకు `కేజీఎఫ్‌`ని తలపించే సీన్లు ఉన్నాయి. అక్కడే మరో కథ జరుగుతుందా? లేక దానికి కంటిన్యూగా ఇది సాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు బీజీఎం పరంగానూ మార్పు లేదు. `కేజీఎఫ్‌` బీజీఎం దీనికి కూడా వాడారా అనే సందేహాలు కలుగుతున్నాయి. 

812

సీన్ల పరంగా, లొకేషన్ల పరంగా చాలా సిమిలారిటీస్‌ ఉన్నాయి. మ్యూజిక్‌ పరంగా కనెక్షన్‌ ఉందని అంటున్నారు. వినడానికి కూడా అలానే ఉండటంతో పెద్దగా కిక్‌ ఇవ్వలేకపోయింది. కేజీఎఫ్‌లో ప్రభాస్‌ చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉందని అంటున్నారు. 
 

912

ఇలా ట్రోల్స్ ఊపందుకుంటున్నాయి. ఇక ట్రైలర్‌లో మొదట్నుంచి కథ చెప్పడం, అది చాలా సాధాసీదాగా అనిపించడంతో స్టఫ్‌ లేదని, కథలో కంటెంట్‌ కనిపించడం లేదని అంటున్నారు. చాలా డల్‌గా ఉందని అంచనాలు డైనోసార్‌ స్థాయిలో ఉంటే, రియాలిటీ యానిమేషన్‌ లా ఉందని ట్రోల్ చేస్తున్నారు ట్రోలర్స్. 
 

1012

ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ షారూఖ్ ఖాన్‌ `డంకీ`తో పోటీ పడుతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. కొంత మంది అయితే షారూఖ్‌ ముందు నిలబడటం కష్టమే అంటున్నారు. ఇప్పటికే రెండు బ్యాక్‌ టూ బ్యాక్‌ బ్లాక్‌ బస్టర్స్ తో ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నారు షారూఖ్‌. ఇప్పుడు రాజ్‌ కుమార్‌ హిరానీ లాంటి దర్శకుడితో `డంకీ` మూవీ చేస్తున్నారు. ఆర్మీ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుండటం విశేషం.
 

1112

దీంతో `డంకీ` ముందు `సలార్‌` నిలబడతాడా? ఢీ కొనగలుగుతాడా? అనే సందేహాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఇలా `సలార్‌` ట్రైలర్‌ ఇప్పుడు ట్రోలింగ్‌కి గురవుతుంది. అంతేకాదు రకరకాలుగా వీడియోలు, కామెడీ క్లిప్పులు జోడీ రచ్చ చేస్తున్నారు నెటిజన్లు. మొత్తానికి `సలార్‌` ట్రైలర్‌ నిరాశ పరిచిందనే ఎక్కువగా వినిపిస్తున్న మాట. 
 

1212

ట్రైలర్‌ మాత్రం సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతుంది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. ఈ ట్రైలర్‌ ఇరవై నిమిషాల్లోనే రెండు మిలియన్స్ వ్యూస్‌ పొందింది. రెండు గంటల్లో ఐదు మిలియన్స్ దాటింది. ట్రైలర్‌ దుమ్మురేపుతుంది. కానీ ట్రోల్స్ కూడాఅదే స్థాయిలో వస్తున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. మరో ఇరవై రోజుల్లో `సలార్‌` రిజల్ట్ తేలనుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories