యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ చిత్రం కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. మరికొద్ది రోజులు ఆగితే ప్రభాస్ విశ్వరూపాన్ని వెండితెరపై చూడవచ్చు. పలుమార్లు వాయిదా పడ్డ సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది.
కొద్దిసేపటి క్రితమే విడుదలైన సలార్ ట్రైలర్ అంచనాలు పెంచేస్తోంది. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే విధంగా గ్రాండ్ గా, అదిరిపోయే ఎలివేషన్స్ తో ప్రభాస్ పాత్ర ఉంది. అయితే ట్రైలర్ లో దాచిపెట్టి ఊరిస్తున్న అంశాలు.. అలాగే కెజిఎఫ్ చిత్రానికి పెట్టిన లింకులు చాలానే ఉన్నాయి.
కెజిఎఫ్ తరహాలోనే ఇక్కడ కూడా కుర్చీ కోసం కుతంత్రాలు, ఆధిపత్య పోరు జరుగుతోంది. ట్రైలర్ ఆ డైలాగ్ కూడా ఉంది. కేజిఎఫ్ చిత్రంతో లింకు ఉందని ఆ డైలాగ్ తో ఖరారు చేసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్ కూడా అదే తరహాలో ఉంది. కెజిఎఫ్ లో రాఖీ భాయ్ ముందుగా తనకోసం లోపలకి వెళ్ళడు. కానీ వెళ్లిన తర్వాత తానే తిరుగులేని శక్తిగా ఎదుగుతాడు.
ఇందులో ప్రభాస్ దేవా పాత్రలో నటిస్తున్నాడు. దేవా తన మిత్రుడి కోసం వస్తాడు. కెజిఎఫ్ లో రాఖీ భాయ్ చిన్నతనంలో పాత్ర కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. దునియా కావాలి అంటూ చెప్పే డైలాగులు ఎలా అలరించాయే చూశాం. ఇందులో దేవా తన మిత్రుడి పృథ్వీ రాజ్ సుకుమారన్ తో చెబుతూ నీ కోసం ఎక్కడ ఉన్నా వస్తా అని అంటాడు.
కెజిఎఫ్ చిత్రానికి, సలార్ కి మధ్య ఉన్న మరో పెద్ద లింక్ ఈశ్వరి రావు పాత్ర. కెజిఎఫ్ లో ఆమె ఎలాంటి గెటప్ తో ఉందో.. అచ్చం అలాగే ఈ చిత్రంలో కూడా కనిపిస్తోంది. ప్రభాస్, ఈశ్వరి రావు క్రాస్ అవుతున్న దృశ్యాలు ట్రైలర్ లో హైలైట్ అనే చెప్పాలి.
ట్రైలర్ లో దాచిపెట్టిన అతిపెద్ద మ్యాటర్ ఏంటంటే.. అసలు సలార్ ఎక్కడ? దేవా పాత్రని చూపించారు కానీ మీసాల గెటప్ లో ఉన్న ప్రభాస్ ని దాచిపెట్టేశారు. బహుశా సినిమాలో ఇదే పెద్ద ట్విస్ట్ ఏమో. ఇక ట్రైలర్ లో చూపించిన సెట్స్ కూడానా కెజిఎఫ్ చిత్రాన్ని తలపించే లాగే ఉన్నాయి. ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్ బావుంది కానీ డైలాగులు ఆశించిన స్థాయిలో లేవు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.