`సలార్‌`కి నైజాంలోనూ నష్టాలు తప్పవా? మైత్రీ ప్లాన్‌ అదిరింది? సినిమా డీలా పడడానికి కారణం ఏంటంటే?

Published : Dec 30, 2023, 05:36 PM IST

`సలార్` సినిమాకి చాలా చోట్ల నష్టాలు తప్పేలా లేవు. భారీగా బిజినెస్‌ కావడంతో బ్రేక్‌ ఇవెన్‌ కావడం కష్టంగా మారింది. తమిళం, కన్నడ, కేరళాలో భారీగా నష్టాలు వచ్చాయి. నైజాంలోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. 

PREV
16
`సలార్‌`కి నైజాంలోనూ నష్టాలు తప్పవా? మైత్రీ ప్లాన్‌ అదిరింది? సినిమా డీలా పడడానికి కారణం ఏంటంటే?

ప్రభాస్‌.. దాదాపు ఆరేళ్ల తర్వాత హిట్‌ కొట్టాడు. `సలార్‌`తో అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకున్నాడు. బలమైన కంటెంట్‌తో వస్తే ఆయన రేంజ్‌ ఎలా ఉంటుందో ఓపెనింగ్స్ తో చూపించాడు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఏకైక హీరోగా ప్రభాస్‌ రికార్డు సృష్టించాడు. ఆయన వరుసగా `బాహుబలి`, `సాహో`, `రాధేశ్యామ్‌`, `ఆదిపురుష్‌`, `సలార్‌` చిత్రాలతో ఆయన వంద కోట్లకుపైగా ఓపెనింగ్స్ ని రాబట్టారు. ఇది కేవలం ఆయన ఫ్యాన్స్ బేస్‌, మార్కెట్‌ వల్లే సాధ్యమైందని చెప్పొచ్చు. కంటెంట్‌ స్ట్రాంగ్‌గా ఉంటే ప్రభాస్‌ కొట్టే దెబ్బకి బాక్సాఫీసు షేక్‌ అవ్వాల్సిందే అని నిరూపించాడు. 
 

26

తాజాగా ప్రభాస్‌ `సలార్‌` సినిమాతో సందడి చేస్తున్నారు. ఈ మూవీ తొలి రోజు ఏకంగా 178కోట్లు సాధించింది. ఐదు రోజుల్లో ఐదు వందల కోట్ల క్లబ్‌లో చేరింది. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి డీలా పడిపోతుంది. నార్త్ లో `డంకీ` దెబ్బ కొట్టడం, తమిళం, కన్నడ, కేరళాలో ఈ మూవీ పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో కలెక్షన్లు పడిపోయాయి. తెలుగులోనూ ఈ శుక్రవారం నుంచి ఇతర సినిమాలు రావడంతో మరింతగా పడిపోయాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో `సలార్‌`కి రోజుకి నాలుగు కోట్లు రావడం గగనంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల లోపే వసూలు చేస్తుంది. 
 

36

ఇదిలా ఉంటే ఈ మూవీకి చాలా చోట్ల నష్టాలు తప్పేలా లేవు. భారీగా బిజినెస్‌ కావడంతో బ్రేక్‌ ఇవెన్‌ కావడం కష్టంగా మారింది. తమిళం, కన్నడ, కేరళాలో భారీగా నష్టాలు వచ్చాయి. నార్త్ లో వంద కోట్లు దాటింది. 93కోట్ల షేర్‌ సాధించింది. ఇంకా ముప్పై కోట్ల నెట్‌ రాబట్టాలి. అంటే చాలా కష్టమని చెప్పొచ్చు. ఇక ఏపీలోనూ నష్టాలు తప్పవంటున్నారు. అంతేకాదు నైజాంలోనూ నష్టాలు తప్పేలా లేవు. ఈ సినిమా 65కోట్లకి మైత్రీ మూవీ మేకర్స్ కొన్నారని ప్రచారం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఈ మూవీ నైజాం రైట్స్ 90కోట్లకు కొన్నారని సమాచారం. ఇదే నిజమైతే నష్టాలు తప్పవు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇది 64కోట్ల నెట్‌ సాధించింది. ఇంకా 25కోట్ల నెట్‌ రావాలి. అంటే సుమారు 40కోట్ల గ్రాస్‌ చేయాలి. మరి ఇప్పుడు రోజుకి కోటీ కూడా రావడం లేదు.

46

నైజాంలో `సలార్‌` లైఫ్‌ టైమ్‌ నెట్‌ 70-75 వరకు రావచ్చు. ఇలా వచ్చినా 15-20కోట్ల నష్టాలు తప్పవు. ఇది నిర్మాతలకు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్లాన్‌ వేశారట. ఇలాంటిది జరిగితే ఏం చేయాలనేది ముందుగానే జాగ్రత్త పడ్డారట. ఒకవేళ పెట్టిన డబ్బులు రిటర్న్ రాకపోతే `సలార్‌` పార్ట్ 2 హక్కులు కూడా తమకే ఇచ్చేలా అగ్రిమెంట్‌ చేసుకున్నారట. దీంతో ఇప్పుడు పోయినా, రెండో పార్ట్ తో నైనా తాము సేఫ్ కావచ్చనేది మైత్రీ ఆలోచన. ఏం జరిగినా పెద్దగా సమస్య లేదని చెప్పొచ్చు. 

56

అయితే `సలార్‌` సినిమా సడెన్‌గా డీలా పడటానికి కారణం ఏంటనేది చూస్తే.. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. యాక్షన్‌ అదిరిపోయింది. ప్రభాస్‌ లుక్‌, కటౌట్‌, ఆయన చేసే యాక్షన్ నెక్ట్స్ లెవల్‌. కానీ అవన్నీ ఫ్యాన్స్ కి, మాస్‌ ఆడియెన్స్ కి మాత్రమే నచ్చుతాయి. కానీ ఫ్యామిలీ వాటిని ఇష్టపడదు. సెంటిమెంట్లు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటేనే వాళ్లు సినిమాకి వస్తారు. కానీ `సలార్‌`లో అవి మిస్‌ అయ్యాయి. మదర్‌ సెంటిమెంట్‌ ఉన్నా అది పండలేదు, కనెక్ట్ అయ్యేలా లేదు. అందులోనూ సస్పెన్స్ ఉంది. 
 

66

మరోవైపు స్నేహం ఉంది, అది కూడా వర్కౌట్‌ కాలేదు. ఇక ఉన్నది ఒక్కటే కాటేరమ్మ ఫైట్‌ సీన్‌. కానీ అది ఒక్కటి ఫ్యామిలీ ఆడియెన్స్ ని థియేటర్‌కి తెప్పించడం కష్టమే. అందుకే ఇప్పుడు `సలార్‌` కి ఫ్యామిలీ ఆడియెన్స్ మిస్ అయ్యారు. దాని కారణంగానే ఇలా కలెక్షన్లు పడిపోయాయి. ఆ విషయంలో ప్రశాంత్‌ నీల్ జాగ్రత్త పడితే సినిమా వేరే లెవల్‌లో ఉండేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి రెండో పార్ట్ లో అయినా ఆ జాగ్రత్తలు తీసుకుంటారేమో చూడాలి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories