క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). రూ.600 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఈ పాన్ వరల్డ్ మూవీ కూడా రెండు పార్టులుగా రాబోతున్నట్టు ప్రకటించారు. 2024 జనవరిలో రిలీజ్ కు ప్లాన్ చేశారు. ఈయర్ ఎండింగ్ లో సలార్ రాబోతుండటంతో ఏం జరుగుతుందో చూడాలి.