అప్పుడప్పుడూ ఒక యాడ్.. కోట్లు పోగేసుకుంటున్న బాలకృష్ణ, ఈసారి ఎంతంటే..

Published : Dec 14, 2023, 02:36 PM IST

మహేష్, బన్నీ, అల్లు అర్జున్ లాంటి ఈ తరం హీరోలకు ధీటుగా బాలయ్య యాడ్స్, కార్పొరేట్ బ్రాండ్స్ ప్రచారాలతో దూసుకుపోతున్నారు.

PREV
16
అప్పుడప్పుడూ ఒక యాడ్.. కోట్లు పోగేసుకుంటున్న బాలకృష్ణ, ఈసారి ఎంతంటే..

నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా భగవంత్ కేసరి చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు. దీనితో బాలయ్య అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ కొట్టినట్లు అయింది. ప్రస్తుతం బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. 

26

మరోవైపు బాలయ్య పాలిటిక్స్ తో కూడా బిజీగా ఉన్నారు. బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా రాణిస్తూ పాలిటిక్స్ లో బిజీగా ఉంటూ కూడా అన్ స్టాపబుల్ లాంటి షోకి హోస్ట్ గా చేయడం బాలయ్యకి మాత్రమే చెల్లింది. 

36

అంతటితో అయిపోలేదు.. మహేష్, బన్నీ, అల్లు అర్జున్ లాంటి ఈ తరం హీరోలకు ధీటుగా బాలయ్య యాడ్స్, కార్పొరేట్ బ్రాండ్స్ ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఆ మధ్యన బాలకృష్ణ ఓ జ్యువెలరీ బ్రాండ్ యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. బాలయ్య ప్రచారంతో సదరు సంస్థ సేల్స్ బాగానే పెరిగినట్లు తెలుస్తోంది. దీనితో బాలకృష్ణకి వరుసగా యాడ్ లో నటించే డీల్స్ వస్తున్నాయి. 

46

ప్రస్తుతం మరో యాడ్ కి బాలయ్య సైన్ చేశారు. పఠాన్ చెరులో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి సంబందించిన యాడ్ ఇది. దీనికోసం బాలయ్య ఆల్రెడీ ఫోటో షూట్ కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవానికి కూడా హాజరు కానున్నారట. దీనికోసం బాలయ్య కి అందుతున్న రెమ్యునరేషన్ దాదాపు 3 కోట్లు. ఇది కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ అనే చెప్పాలి. 

56

దీనికోసం బాలయ్య పెద్దగా సమయం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. 3 కోట్లు ఇట్టే వచ్చి పాకెట్ లో పడిపోతాయి. బాలకృష్ణ హీరోగా, హోస్ట్ గా, బ్రాండ్ అంబాసిడర్ గా, పొలిటీషియన్ గా ఆల్ రౌండ్ పెర్ఫామెన్స్ ఇస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. 

66

బాలకృష్ణ హ్యాట్రిక్ విజయాలు అందుకున్న తర్వాత డైరెక్టర్ బాబీ తెరకెక్కించే చిత్రంపై భారీ అంచనాలు మొదలయ్యాయి. పైగా బాబీ మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి సాలిడ్ హిట్ అందుకుని ఈ చిత్రం చేస్తున్నాడు. 

Read more Photos on
click me!

Recommended Stories