బ్లాక్ డ్రెస్ లో టాప్ క్లాస్ గ్లామర్... సూపర్ హాట్ ఫోజుల్లో శృతి బోల్డ్ ఫోటో షూట్!

Published : May 22, 2023, 08:32 AM IST

శృతి హాసన్ కాన్స్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఆమె బ్లాక్ ట్రెండీ వేర్ ధరించి అల్ట్రా స్టైలిష్ లుక్ లో అలరించారు. శృతి లేటెస్ట్ లుక్ మనసు దోచేస్తుంది. 

PREV
17
బ్లాక్ డ్రెస్ లో టాప్ క్లాస్ గ్లామర్... సూపర్ హాట్ ఫోజుల్లో శృతి బోల్డ్ ఫోటో షూట్!
Shruti Haasan


కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 ఘనంగా జరుగుతుంది. ప్రపంచ సినిమా వేదికలో అందమైన తారలు పాల్గొంటున్నారు. ఇండియా నుండి మృణాల్, ఐశ్వర్య రాయ్, ఊర్వశి రాతెలా పాల్గొన్నారు. అలాగే శృతి హాసన్ సైతం సందడి చేశారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం బ్లాక్ ట్రెండీ వేర్లో శృతి సిద్ధమయ్యారు. 
 

27
Shruti Haasan


ఇక మూడేళ్లు చిత్ర పరిశ్రమకు దూరమైన శృతి హాసన్ కమ్ బ్యాక్ తర్వాత సక్సెస్ ట్రాక్ లో దూసుకువెళుతున్నారు. టాలీవుడ్ లో ఆమె క్రేజీ ఆఫర్స్ పట్టేస్తుంది క్రాక్, వకీల్ సాబ్ చిత్ర విజయాలతో ఆమె ఫార్మ్ లోకి వచ్చారు. 

37
Shruti Haasan


ఇక ఈ ఏడాదిని గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. సంక్రాంతి కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు విజయాలు సాధించాయి.  మైత్రీ మూవీ మేకర్స్ వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటించినందుకు గాను రూ. 5 కోట్ల వరకు చెల్లించారట.
 

47
Shruti Haasan


 కెరీర్ దాదాపు ఫేడ్ అవుటైన దశలో మెల్లగా ఆఫర్స్ అందుకొని విజయాలతో మేకర్స్ దృష్టిని శృతి ఆకర్షిస్తున్నారు. ప్రస్తుతం ఆమె సలార్ మూవీ చేస్తున్నారు.ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ విజయం శృతికి చాలా కీలకం. ఈ భారీ పాన్ ఇండియా మూవీ హిట్ కొడితే శృతి కెరీర్ మరో దశకు చేరుతుంది. సలార్ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. సలార్ చాలా వరకు షూట్ జరుపుకుంది. 

57
Shruti Haasan

అలాగే నాని 30మూవీలో శృతి హాసన్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సమాచారం అందుతుంది. ది ఐ టైటిల్ తో ఇంగ్లీష్ మూవీ ఒకటి చేస్తున్నారు. కెరీర్ ఎలా ఉండగా ముంబైకి చెందిన శాంతను హజారికతో ఆమె సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమాయణం బహిరంగ రహస్యమే. శాంతను డూడుల్ ఆర్టిస్ట్. రెండేళ్లకు పైగా శాంతను-శృతి హాసన్ కలిసి జీవిస్తున్నారు.

67
Shruti Haasan


గతంలో శృతి హాసన్ లండన్ కి చెందిన మైకేల్ కోర్స్లేతో ఎఫైర్ నడిపారు. వీరిద్దరూ వివాహం చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. మరి శాంతనుతో అయినా ఆమె బంధం పెళ్లి వరకు వెళుతుందా? అనే సందేహాలు ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
 

77
Shruti Haasan

శృతి హాసన్ కాన్స్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఆమె బ్లాక్ ట్రెండీ వేర్ ధరించి అల్ట్రా స్టైలిష్ లుక్ లో అలరించారు. శృతి లేటెస్ట్ లుక్ మనసు దోచేస్తుంది. 

click me!

Recommended Stories