ఒక్కరోజుకు రూ. 4 కోట్లు... శర్వానంద్ పెళ్లి బడ్జెట్ విని షాక్ అవుతున్న ఇండస్ట్రీ!

Published : May 22, 2023, 07:07 AM IST

హీరో శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. శర్వానంద్ పెళ్లి బడ్జెట్ గురించి ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.   

PREV
17
ఒక్కరోజుకు రూ. 4 కోట్లు... శర్వానంద్ పెళ్లి బడ్జెట్ విని షాక్ అవుతున్న ఇండస్ట్రీ!


శర్వానంద్ కి పెళ్లీడు వచ్చి చాలా కాలం అవుతుంది. ఎట్టకేలకు ఆయన ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జూన్ 2,3 తేదీల్లో శర్వానంద్ వివాహం ఘనంగా జరగనుంది.  తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత రెడ్డిని శర్వానంద్ పెళ్ళి చేసుకుంటున్నారు. రక్షిత ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, దివంగత టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మనవరాలు కూడాను. రక్షిత ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటూ ఉద్యోగం చేస్తోందని సమాచారం. 

27


జనవరిలో నిశ్చితార్థం జరగ్గా శర్వానంద్-రక్షిత రెడ్డి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. ఇందుకు రాజస్థాన్ లోని లీలా ప్యాలస్ ఎంచుకున్నారు. అక్కడ రెండు రోజులు శర్వానంద్-రక్షిత రెడ్డిల వివాహం జరగనుంది. మెహందీ, సంగీత్, హల్దీ ఫంక్షన్స్ గ్రాండ్ గా ప్లాన్ చేశారు. 
 

37


అయితే శర్వానంద్ పెళ్లి బడ్జెట్ ఇదే అంటూ ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. ఓ వాదన మేరకు లీలా ప్యాలస్ లో వివాహం అంటే రోజుకు రూ. 4 కోట్లు అవుతాయట. ఆ విధంగా రెండు రోజులు అక్కడ వివాహ వేడుక జరగనుంది. ఇక పెళ్లి బట్టలు, నగలు, విందులు, వినోదాలు, మిగతా ఏర్పాట్లకు మరికొంత ఖర్చు కానుంది. 

47


జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే వేడుకను శర్వానంద్ ఘనంగా చేసుకుంటున్నారని సమాచారం. ఇక శర్వానంద్ వివాహానికి టాలీవుడ్ నుండి ఎవరెవరికి ఆహ్వానం ఉంది. ఎవరెవరు వస్తారు? అనేది చూడాలి. మెగాస్టార్ ఫ్యామిలీకి శర్వానంద్ అత్యంత సన్నిహితుడు. చిరంజీవి, రామ్ చరణ్ కచ్చితంగా హాజరయ్యే సూచనలు కలవు. 

57

ఇక శర్వానంద్ కెరీర్ పరిశీలిస్తే... ఆయన మొదట్లో సపోర్టింగ్ రోల్స్ చేశారు. గమ్యం, ప్రస్థానం చిత్రాలు గుర్తింపు తెచ్చాయి. రన్ రాజా రన్, శతమానం భవతి, మహానుభావుడు వంటి కమర్షియల్ హిట్స్ తో టైర్ టూ హీరోల జాబితాలో చోటు సంపాదించారు. ఈ మధ్య ఆయన సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నారు.

67

శర్వానంద్‌-రక్షిత ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో సందడి చేసిన టాలీవుడ్‌ తారలు. ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌, ఉపాసన పాల్గొని కాబోయే జంటని ఆశీర్వదించారు.
 

77

శర్వానంద్‌-రక్షిత ఎంగేజ్‌మెంట్‌ వేడుకలో సందడి చేసిన టాలీవుడ్‌ తారలు. ఎంగేజ్‌మెంట్‌ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

click me!

Recommended Stories