ఇక రిషి (Rishi), సాక్షి (Sakhi) వెడ్డింగ్ కార్డులో నా పక్కన ఉండటం ఏమిటి? అని కోపం పడుతూ ఉంటాడు. అదే క్రమంలో నేను ఎవరిని నా మనసులో ఆహ్వానిస్తున్నాను అని అనుకొని వసు తో తనకు జరిగిన తీపి జ్ఞాపకాలను ఊహించుకుంటాడు. అంతేకాకుండా వసు దూరంగా వెళితే తను ఉండలేను అని గ్రహించి.. ఇదేనా ప్రేమంటే అని అనుకుంటాడు.