Sai Pallavi: కాబోయే భర్తకు సాయి పల్లవి కండిషన్స్ ఇవే.. లిస్ట్ పెద్దదే, అది మాత్రం కంపల్సరీ

Published : Oct 29, 2026, 01:11 PM IST

రామాయణ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కేబీసీ షోకు వెళ్లిన సాయి పల్లవి, తన కాబోయే భర్త ఎలా ఉండాలనే విషయంపై ఓపెన్‌గా మాట్లాడింది. కాబోయే భర్త విషయంలో ఆమె కండిషన్స్ చాలా ఎక్కువే ఉన్నాయి.

PREV
14
కాబోయే భర్త గురించి ఓపెన్ అయిన సాయి పల్లవి
నితీష్ తివారీ డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'రామాయణ: పార్ట్ 1'. ఈ మూవీ ప్రమోషన్స్‌లో చిత్రయూనిట్ బిజీగా ఉంది. ఇందులో భాగంగా అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (కేబీసీ) షోలో రణ్‌బీర్, సాయి పల్లవి పాల్గొన్నారు. దీపావళి స్పెషల్‌గా రాబోతున్న ఈ ఎపిసోడ్‌లో వాళ్లు తమ పర్సనల్ లైఫ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా తన కాబోయే భర్త ఎలా ఉండాలన్న దానిపై సాయి పల్లవి ఇచ్చిన ఆన్సర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
24
సాయి పల్లవికి ఎలాంటి భర్త కావాలి?

కేబీసీ షోలో అమితాబ్ బచ్చన్.. సాయి పల్లవిని తన లైఫ్ పార్ట్‌నర్ ఎలా ఉండాలని అడిగారు. దీనికి ఆమె బదులిస్తూ, తన వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రొఫెషనల్ లైఫ్‌ను గౌరవించే వ్యక్తి అయి ఉండాలని చెప్పింది. ఆడవాళ్లు ఆర్థికంగా స్థిరపడటం, తమ జీవితాన్ని తామే లీడ్ చేయడం చాలా అవసరం అని ఆమె అభిప్రాయపడింది. తన లక్ష్యాలకు సపోర్ట్ చేస్తూ, తన ఇష్టాలను గౌరవించే వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది.

34
వంట బాగా చేయడం వచ్చి ఉండాలి
భార్యాభర్తల బంధంలో నమ్మకం, గౌరవం చాలా ముఖ్యమని సాయి పల్లవి చెప్పింది. అలాగే తన పార్ట్‌నర్‌కు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలంది. ఇవన్నీ చెబుతూనే, తన కాబోయే భర్తకు వంట కూడా బాగా వచ్చి ఉండాలని సరదాగా కామెంట్ చేసింది. ఆమె ఇచ్చిన ఈ ఆన్సర్‌తో షోలో అందరూ నవ్వుకున్నారు. లైఫ్ పార్ట్‌నర్ గురించి సాయి పల్లవి చెప్పిన విషయాలు ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్‌గా మారాయి.
44
నవంబర్ 5న 'రామాయణ: పార్ట్ 1' రిలీజ్
సాయి పల్లవి సీతగా నటిస్తున్న 'రామాయణ: పార్ట్ 1' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నితీష్ తివారీ తీస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించారు. రీసెంట్‌గా అమెరికాలో ఈ మూవీ ప్రీమియర్ షో వేశారు. సినిమా చూసిన వాళ్లు అద్భుతంగా ఉందని చెప్పడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఒకవైపు రామాయణ ప్రమోషన్స్, మరోవైపు కేబీసీ షోలో సాయి పల్లవి కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
Read more Photos on
click me!

Recommended Stories