కవలుగా కనిపించే అక్కాచెల్లెల్లు.. టాలీవుడ్ నటీమణుల సిస్టర్స్ ను చూశారా?

Published : Jan 18, 2024, 08:29 PM ISTUpdated : Jan 19, 2024, 10:50 AM IST

సౌత్ లో దుమ్ములేపుతున్న కొందరు హీరోయిన్లు తమ సిస్టర్స్ తో కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ట్విన్స్ లాగే కనిపించే కొంతమంది అక్కాచెల్లెళ్ల గురించి తెలుసుకుందాం. 

PREV
17
కవలుగా కనిపించే అక్కాచెల్లెల్లు.. టాలీవుడ్ నటీమణుల సిస్టర్స్ ను చూశారా?

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi)  తన చెల్లి పూజా కన్నన్ (Pooja Kannan) ఇద్దరు ట్విన్స్ లాగే కనిపించారు. 90శాతం పోలికలు దగ్గరగా ఉంటాయి. వీరిని ఒకే అవుట్ ఫిట్ లో చూస్తే సందేహం కలుగక మానదు. ఈ క్రమంలో సాయి పల్లవి తనచెల్లితో దిగిన కొన్ని ఫొటోలు ఇప్పటికే నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సాయిపల్లవి వరుస చిత్రాలతో దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. చెల్లి కూడా తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ‘చితిరై సెవ్వానం’ అనే సినిమాతో ప్రేక్షకులను అలరిస్తోంది.
 

27

తెలుగు చిత్ర పరిశ్రమలో ఫైట్ మాస్టర్లుగా రామ్ - లక్ష్మణ్ (Ram Laxman) మంచి పేరు దక్కించుకున్నారు. వ్యక్తిత్వంగానూ ప్రశంసలు పొందుతుంటారు. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు వర్క్ చేస్తున్నారు. వీరిద్దరూ మాత్రం ట్విన్స్ అనే విషయం చాలా మందికే తెలిసి ఉంటుంది. 

37

తెలుగు ద్వయం దర్శకులు ధర్మ, రక్ష Dharma Raksha కూడా ట్విన్స్ కావడం విశేషం. వీరిద్దరూ కలిసి రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ ‘చందమామ రావే’ చిత్రాన్ని తెరకెక్కించారు. 2017లో విడుదలైన ఈ చిత్రంలో నవీన్ చంద్ర హీరోగా నటించారు. 

47

ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ (kajal Aggarwal) తన చెల్లెలు, హీరోయిన్ నిశా అగర్వాల్ (Nisha Aggarwal)  ఇద్దరూ ఒకేలా ఉంటారు. కానీ వీరూ ట్విన్స్ కాదు.. అయినా చెల్లిని చూస్తే అచ్చం అక్కాలాగే కనిపిస్తుంది. వీరిద్దరూ టాలీవుడ్ లో సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులను అలరించారు. 

57

సినిమా నటి సిమ్రాన్ (Simran) ఇప్పటికీ ఆయా చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక సిమ్రాన్ సోదరి మోనల్ (Monal)  తను ఓకేలా ఉంటారు. వీరి మధ్య పోలికలు చాలా దగ్గరగా ఉంటాయి. 

67

సీనియర్ హీరోయిన్ జయసుధ Jayasudha కూడా తన సోదరి సుభాషిణితో దగ్గరి పోలికలను కలిగి ఉంటారు. కొన్ని ఈవెంట్లకు హాజరైనప్పుడు ఓకే పోలికలతో కనిపించి ఆశ్చర్యపరిచారు. 

77

కమల్ హాసన్ కూతుర్లు శృతిహాసన్ (Shruti Haasan), అక్షర హాసన్ (Akshara Haasan) కూడా ఓకే పోలికలను కలిగి ఉంటారు. ఆయా సందర్భాల్లో చెల్లితో శృతిహాసన్ దిగిన ఫొటోలు నెట్టింట చాలా వైరల్ గా మారాయి. దాదాపు ఒకేలా కనిపించే ఈ అక్కాచెల్లెల్లు  కూడా ట్విన్స్ మాత్రం కాదు.  

Read more Photos on
click me!

Recommended Stories