లవ్ స్టోరీ యూఎస్ ప్రీమియర్ రివ్యూ

First Published Sep 24, 2021, 7:41 AM IST

శేఖర్ కమ్ముల చిత్రాలంటే ప్రేక్షకులలో ఓ స్థాయి అంచనాలుంటాయి. ఫిదా చిత్రంతో సంచనాలు నమోదు చేసిన సాయి పల్లవి, శేఖర్ కావడంతో ఆ అంచనాలు మరింతగా పెరిగాయి. అవుట్ అండ్ అవుట్ లవ్ డ్రామాగా తెరకెక్కిన లవ్ స్టోరీ ఎలా వుందో ఇప్పుడు చూద్దాం


 
కథ:వెనుకబడిన సామజిక వర్గానికి చెందిన మిడిల్ క్లాస్ అబ్బాయి అయిన రేవంత్(నాగ చైతన్య) ఏదైనా బిజినెస్ చేయాలని హైదరాబాద్ వస్తాడు. రేవంత్ గ్రామానికే చెందిన మౌనిక (సాయి పల్లవి) బి టెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. భిన్నమైన సామాజిక వర్గాలు, పేద ధనిక తరతమ్యాలున్న రేవంత్, మౌనిక ఎలా కలిశారు? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనేది మిగతా కథ
 

అనుకున్న కథను సహజంగా చెప్పడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. ఆయన పనితనం, డైరెక్షన్ స్కిల్స్ లవ్ స్టోరీలో కచ్చితంగా కనిపిస్తాయి. ప్రేమ కథను సామాజిక కోణంలో ఆయన చెప్పిన విధానం బాగుంది.
 

 
లీడ్ పెయిర్ సాయి పల్లవి, నాగ చైతన్య మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ శేఖర్ కమ్ముల ప్రేక్షకుల అంచనాలు అందుకోగలిగారు. జుంబా క్లాసెస్ లో లీడ్ చైతు, సాయి పల్లవి మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. 
 


అయితే సెకండ్ హాఫ్ లో శేఖర్ కమ్ముల తేలిపోయారు. ఆయన లవ్ స్టోరీకి సరైన ముగింపు ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. చెప్పాల్సినదంతా ఫస్ట్ హాఫ్ లోనే చెప్పేసిన శేఖర్, సెకండ్ హాఫ్ పై ప్రేక్షకులకు ఆసక్తిని లేకుండా చేశారు. శేఖర్ కమ్ముల గత చిత్రాల ఛాయలు కూడా మూవీలో కనిపించడం మరొక మైనస్. 
 


ఇక కథలో కొత్తదనం కొరవడింది. ఈ తరహా ప్రేమ కథలో ఇప్పటికే ప్రేక్షకులు అనేకం చూసేశారు. కాకపోతే శేఖర్ కమ్ముల తనకు పట్టున్న తెలంగాణా నేపధ్యాన్ని ఎంచుకొని, ఈ కథను కొత్తగా చెప్పాలని అనుకున్నారు. అసలు లవ్ స్టోరీ మూవీలో డీప్ లవ్ స్టోరీ లేకపోవడం కూడా ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం. 
 

ఇక హీరో హీరోయిన్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే నాగ చైతన్య కేరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. తెలంగాణకు చెందిన యువకుడు పాత్రలో ఆకట్టుకున్నాడు. ఆయన డైలాగ్ డెలివరీ, యాక్సెంట్ మెప్పించింది. 

శేఖర్ కమ్ముల చిత్రాలలో హీరోయిన్స్ అధిక ప్రాధాన్యత ఉంటుంది. లవ్ స్టోరీ చిత్రంలో మాత్రం సాయి పల్లవి కంటే నాగ చైతన్య పాత్రపైనే శేఖర్ కమ్ముల అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అలా అని సాయి పల్లవికి తక్కువ ప్రాధాన్యత ఉందని అనుకుంటే పొరపాటే. సాయి పల్లవి తన మార్కు నటనతో ఆకట్టుకున్నారు.

కాంబినేషన్ తో పాటు శేఖర్ కమ్ముల గత చిత్రం ఫిదా భారీ హిట్ కావడంతో మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఆ అంచనాలు సినిమా అందుకోలేదు. ఏదో గొప్ప సినిమా చూడబోతున్నామనే అంచనాలతో సినిమాకు వెళ్లిన ప్రేక్షకుడిని లవ్ స్టోరీ సంతృప్తి పరచలేదు. 

click me!