ఐదు పదుల వయసులోనూ తరగని అందం మీనా సొంతం.. తన గర్ల్స్ తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్‌.. ఫోటోలు వైరల్‌

Published : Sep 23, 2021, 09:54 PM IST

అందాల నటి, వన్నె తగ్గని గ్లామర్‌ బ్యూటీ మీనా(meena) నెట్టింట ట్రెండ్ అవుతుంది. తన బర్త్ డే(meena birthday) ఫోటోస్‌తో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. కుర్ర హీరోయిన్లకి మించిన ఫాలోయింగ్‌తో కుర్రాళ్ల మతిపోగొడుతుంది. మీనా తన బర్త్ డే ఫోటోలు పంచుకోగా, అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.   

PREV
113
ఐదు పదుల వయసులోనూ తరగని అందం మీనా సొంతం.. తన గర్ల్స్ తో కలిసి బర్త్ డే సెలబ్రేషన్‌.. ఫోటోలు వైరల్‌

ఇటీవల(సెప్టెంబర్ 16)న మీనా పుట్టిన రోజు. ఆ రోజు తన ఫ్రెండ్స్ తో కలిసి ఆమె పుట్టిన రోజు జరుపుకున్నారు. గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారంతా క్యూట్‌గా, హాట్‌గా ఫోటోలకు పోజులిచ్చారు. 
 

213

ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది మీనా. మై గర్ల్స్ అంటూ, మొత్తంగా తన స్నేహితులతో కలిసి బర్త్ డే సెలబ్రేట్‌ చేసుకున్నానని తెలిపింది. ప్రస్తుతం ఈ పిక్స్ సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

313

ఇందులో నటి శ్రీదేవి, స్నేహ, సంగీత కూడా ఉన్నారు. బర్త్ డే సందర్భంగా మీనా ధరించిన డ్రెస్‌ హైలైట్‌గా నిలిచింది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో మరింత హాట్‌గా కనిపిస్తుంది మీనా. 

413

మీనా.. తమిళ సినిమా `నెంజగల్` తో బాలనటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన `సిరిపురం మొనగాడు` సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అడుగుపెట్టి పలు సినిమాల్లో బాలనటిగా అలరించింది.

513

దక్షిణాదిలో కన్నడ తప్ప మిగతా భాషల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. ఇక హీరోయిన్‌గా రాజేంద్ర ప్రసాద్, వినోద్ కుమార్ హీరోలుగా నటించిన `నవయుగం` సినిమాతో కథానాయికగా పరిచయమైంది. హీరోయిన్‌గా మీనా.. కేవలం నటనతో పాటు గ్లామర్ ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి దక్షిణాది ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది.
 

613

దక్షిణాది సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి, విష్ణువర్ధన్, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, విజయ్, అజిత్ రెండు తరాల  హీరోల సరసన కథానాయికగా నటించి మెప్పించింది.
 

713

తెలుగు కథానాయికగా మీనా తొలి చిత్రం `నవయుగం`. ఏఎన్నార్ ప్రధాన పాత్రలో క్రాంతి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `సీతారామయ్యగారి మనవరాలు` సినిమా కథానాయికగా మీనాకు మంచి గుర్తింపు లభించింది.

813

వెంకటేష్ హీరోగా రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన `చంటి` సినిమాతో స్టార్ హీరోయిన్‌గా అయింది. క్రేజీ నటిగా మారింది. ఆ తర్వాత `అల్లరి పిల్ల`, `ప్రెసిడెంట్ గారి పెళ్లాం`, `అల్లరి పిల్ల`, `అల్లరి మొగుడు`, `ముఠామేస్త్రి`, `అశ్వమేథం`, `మొరటోడు నా మొగుడు`, `అల్లరి అల్లుడు`, `రాజేశ్వరి కళ్యాణం`, `బొబ్బిలి సింహం` వంటి సినిమాలు హీరోయిన్‌గా మీనా స్టార్‌ డమ్‌ను పెంచాయి.

913

రజనీకాంత్ హీరోగా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `ముత్తు` సినిమాతో తమిళనాట మీనా క్రేజ్ పీక్స్‌కు చేరింది. అటు జపాన్‌లో రజనీకాంత్‌తో సమానమైన ఫాలోయింగ్ ఉన్న ఏకైక సౌత్ హీరోయిన్ మీనా కావడం విశేషం.
 

1013

దక్షిణాదిలో అన్ని జానర్స్‌లో సినిమాలు చేసిన మీనా. హిందీలో మాత్రం `పరదా మై పరదా` అనే ఒకే ఒక్క సినిమా చేసింది. అక్కడ సరైన ఆదరణ దక్కలేకపోవడంతో ఆమె మళ్లీ ఆ వైపు చూడలేదు.

1113

హీరోయిన్‌గా విభిన్న పాత్రల్లో నటించిన మీనా.. ఇపుడు విలన్‌గా నెగిటెవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాలని ఉందని చెబుతోంది. ప్రస్తుతం మీనా.. సీనియర్ హీరోలకు బెస్ట్ ఛాయిస్‌గా మారింది. 

1213

ఇప్పటికే మోహన్‌లాల్  `దృశ్యం2`లో నటించింది. వెంకీతో `దృశ్యం2`లో నటించగా, రజనీకాంత్తో `అన్నాత్తే`లో, అలాగే బాలకృష్ణ, గోపిచంద్ మలినేని చిత్రంలో హీరోయిన్‌గా నటించబోతున్నట్టు సమాచారం.

1313

అందాల నటి మీనా ఇటీవల పుట్టిన రోజు జరుపుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫోటో షూట్‌ పిక్స్ ని తాజాగా అభిమానులతో పంచుకుంది మీనా. అవి నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories