సాయిపల్లవి(Sai Pallavi) తాజాగా ఓ హాట్ కామెంట్ చేసింది. నాని హిట్ సినిమా `ఎంసీఎం`(MCA)పై తనకు సెట్ కాదంటూ ఆసక్తికర కామెంట్ చేసింది. అలాంటి పాత్రల్లో తాను కంఫర్ట్ గా ఉండలేనని చెప్పింది. అలాంటి పాత్రలు చేయడమనేది ఆత్మ ఒకచోట, బాడీ మరో చోట ఉన్నట్టు అనిపిస్తుందని పేర్కొంది. `ఎంసీఏ` సగం షూటింగ్ అయ్యాక ఆ విషయం తనకు అర్థమైందని పేర్కొంది. తాను ఏ సినిమా చేసినా అందులో తాను కనిపించాలని, అది తనకు హెల్ప్ అయ్యేలా ఉండాలని, తనలోని నటన మరింతగా బయటకు తెప్పించేలా ఉండాలని చెప్పింది. మొత్తంగా నాని సినిమా చేయడం కరెక్ట్ కాదని రియలైజ్ అయినట్టు పేర్కొందీ నేచురల్ హీరోయిన్.
సాయిపల్లవి ఇటీవల `లవ్ స్టోరి` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని ఫిదా చేసింది. ఇప్పుడు మరోసినిమాతో రాబోతుంది. `ఎంసీఏ` తర్వాత Naniతో కలిసి మరోసారి `శ్యామ్‌సింగరాయ్`(Shyam Singha Roy) చిత్రంలో నటించింది. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంక్రిత్యాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా Sai Pallavi మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది.
ఇందులో తాను దేవదాసి పాత్రలో కనిపించబోతున్నట్టు చెప్పింది. ఆ పాత్ర కోసం చాలా కష్టపడిందట. తనకు ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఇది చాలా టఫ్ రోల్ అని పేర్కొంది. అయితే ఇందులో ఇంకా కొంచెం అసంతృప్తి ఉందని, ఇలాంటి మరో పాత్ర వస్తే సంతృప్తిగా నటిస్తానని, ఆ లోటుని కంప్లీట్ చేసుకుంటానని చెప్పింది. నానితో నటించడం వండర్‌ఫుల్ ఎక్స్ పీరియెన్స్ అని పేర్కొంది. దర్శకుడు రాహుల్ సాంక్రిత్యాన్ క్లారిటీ ఉన్న దర్శకుడు అని, ఆయనకు ఏం కావాలో క్లారిటీగా తెలుసు అని, ఎంత వరకు నటించాలో పర్‌ఫెక్ట్ గా చెబుతాడని చెప్పింది. ఆర్టిస్టులను బాగా గైడ్ చేస్తాడని చెప్పింది.
ఇక ప్రస్తుతం `శ్యామ్ సింగరాయ్` చిత్రంలోని `ప్రణవాలయ` పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో ఈ పాట గురించి చెబుతూ, ఈ పాటకి చాలా కష్టపడినట్టు చెప్పింది. ఈ పాటలో నర్తించాలంటే శాస్త్రీయ డాన్సుపై అవగాహన ఉండాలని, కానీ తాను పగలు రిహార్సల్ చేసి, రాత్రి సమయంలో డాన్సు చేసేదట. చాలా టఫ్‌గా సాగిందని చెప్పింది. ఈ పాటకి ఇంతటి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉందని తెలిపింది.
ప్రారంభం నుంచి తనకు చిత్ర పరిశ్రమ నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుందని, ఈ ప్రేమని తనకు గౌరవంగా, అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పింది. ఇలాంటి పాత్రలు రావడం దర్శకులకు ఆ క్రెడిట్ దక్కుతుందని చెప్పింది. దర్శకులు తనకు బలమైన పాత్రలు ఇవ్వడం వల్లే తాను నటించగలుగుతున్నానని చెప్పింది. తనపై ఇంతటి ప్రేమ చూపిస్తున్నందుకు చాలా హ్యాపీగా, గౌరవంగా ఉందని పేర్కొంది. హీరోలకు సమానంగా తనని ట్రీట్ చేయడం, సినిమా పోస్టర్లపై కూడా తనకు ప్రయారిటీ ఉండటం, తన కోసం ఆడియెన్స్ థియేటర్ కి రావడం అదృష్టమని చెప్పింది.
ఇటీవల శ్యామ్‌సింగరాయ్` ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన విషయం చెబుతూ, తన పాటకి అద్భుతమైన స్పందన లభించిందని, ఆ పాట విన్నాక అంతా అరుస్తూ గోల చేయడం, సాయిపల్లవి అంటూ సౌండ్ చేయడం, పైగా గెస్ట్ లు కూడా పాట గురించి, తన డాన్సు గురించి ప్రశంసిస్తుంటే చాలా ఎమోషనల్ అయిపోయానని తెలిపింది సాయిపల్లవి.
మూడేళ్ల క్రితం ఓకే చెప్పిన సినిమాలు ఇప్పుడు ఒకేసారి విడుదలవుతున్నాయని చెప్పిన సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో `విరాటపర్వం` లో నటిస్తున్నట్టు చెప్పింది. ఇది షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీ అవుతుందట. తమిళంలో ఓ సినిమాకి కమిట్ అయినట్టు పేర్కొంది.